Rain Alert November 20th: ఏపీపై రెండు ఆవర్తనాల ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 ప్రధానాంశాలు:

  • బంగాళాఖాతంలో ఆవర్తనాలు
  • ఏపీకి వాతావరణశాఖ వర్ష సూచన
  • అక్కడక్కడా భారీ వానలకు అవకాశం


Andhra Pradesh Rains Update : ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఆగ్నేయ బంగాళాఖాతం.. దానికి ఆనుకుని అండమాన్‌ సముద్రం.. శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో ఈ నెల 20వ తేదీ నుంచి తూర్పుగాలులు బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 20వ తేదీన దక్షిణ కోస్తా, 21 నుంచి 23 వరకు కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధప్రదేశ్‌ & యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు.. ఉరుములతో వానలకు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌‌లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో వానలకు ఛాన్స్ ఉంది.

రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వానలు.. ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.

Below Post Ad


Tags

Post a Comment

0 Comments