India vs Australia World Cup Final: చేతులెత్తేసిన టీమిండియా.. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా
World Cup Final Live Score: ఆస్ట్రేలియా మరో వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్లో ఇండియాను 6 వికెట్లతో చిత్తు చేసి ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ట్రావిస్ హెడ్ సెంచరీ, లబుషేన్ హాఫ్ సెంచరీతో 241 రన్స్ టార్గెట్ ను మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. స్వదేశంలో టీమిండియాకు ఇది ఘోర పరాభవం. వరుసగా పది మ్యాచ్ లు గెలిచిన ఇండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది.
ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ గెలిచింది. 241 రన్స్ లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. మూడో వరల్డ్ కప్ గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోయింది. అసలు మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లలో టీమిండియా చేతులెత్తేసింది. ట్రావిస్ హెడ్ 120 బంతుల్లోనే 137 రన్స్ చేసి ఆస్ట్రేలియాను గెలిపించాడు. లబుషేన్ కూడా 58 పరుగులతో అజేయంగా నిలిచాడు.