అధిక రక్తపోటు ఉన్న రోగులు తేనెతో కలిపిన పొడి ఇంగువా తీసుకోవచ్చు. ఇది మీకు ఆస్తమా, శ్వాస సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. మీ BP కూడా నియంత్రణలో ఉంటుంది. కార్మినేటివ్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఉపశమన మరియు మూత్రవిసర్జన లక్షణాలు, జీర్ణ క్రియ కు సంబంధించిన వ్యాధులను నయం చేయటంలో ఇంగువా ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇంగువా…సాధారణంగా చాలా తక్కువ మంది ఇళ్లల్లో ఇంగువా ఉపయోగిస్తుంటారు. కానీ ఇంగువా ఎప్పటి నుంచో చాలా రకాల హోం రెమెడీస్ లో వాడుతున్నారు. ముఖ్యంగా కడుపు సమస్యలకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. అంతేకాదు. ఇంగువా అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా అద్భుతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో అధిక రక్తపోటు అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంగువ మీకు సహాయం చేస్తుంది. అవును, అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇంగువ ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం..
ఇంగువను ఉపయోగించేందుకు ఉత్తమమైన, సులభమైన మార్గం మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం. దీని కోసం ఇంట్లో తయారుచేసిన పప్పులు, కూరగాయలలో ఇంగువాను ఉపయోగించండి. ఇది మీ ఆహారం రుచిని కూడా పెంచుతుంది. మీ BP ని అదుపులో ఉంచుతుంది. ఇంగువ మన శరీరంలో రక్తం మందంగా తయారు కాకుండా రక్తాన్ని పలచగా చేస్తుంది. దీని వల్ల మన శరీరంలో రక్తపోటు బాలన్స్ గా ఉంటుంది.
అధిక రక్తపోటు ఉన్న రోగులు తేనెతో కలిపిన పొడి ఇంగువా తీసుకోవచ్చు. ఇది మీకు ఆస్తమా, శ్వాస సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. మీ BP కూడా నియంత్రణలో ఉంటుంది. కార్మినేటివ్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఉపశమన మరియు మూత్రవిసర్జన లక్షణాలు, జీర్ణ క్రియ కు సంబంధించిన వ్యాధులను నయం చేయటంలో ఇంగువా ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆడవారిలో కలిగే పీరియడ్స్ కడుపు నొప్పిని నయం చేస్తుంది. తలనొప్పిని తగ్గిస్తుంది, ఉబ్బసం నుండి ఉపశమనం కలిగిస్తుంది. సైంధవ ఉప్పుతో పాటు ఇంగువ వాడండి – మీరు ఇంగువను పొడి రూపంలో కూడా ఉపయోగించవచ్చు. దీనికి గోరువెచ్చని నీళ్లలో అరచెంచా తీసుకుని అందులో చిటికెడు సైంధవ లవణం, చిటికెడు అల్లం కలిపి తింటే కడుపునొప్పి, వాతం, గ్యాస్, హైబీపీ పోవడమే కాకుండా.. కడుపునొప్పిని కూడా తగ్గిస్తుంది. చిటికెడు ఇంగువాను మజ్జిగ లేదా ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మంచి ఉపశమనం ఉంటుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)