Trending

6/trending/recent

Health tips: చలికాలంలో తీవ్రమైన కీళ్ళనొప్పులు తగ్గే చిట్కాలు!!

చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు,ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. చాలామందికి చలికాలంలో కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక అలాంటి వారు చలికాలంలో కీళ్ల నొప్పుల నుండి, ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్-డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది.

Health tips: చలికాలంలో తీవ్రమైన కీళ్ళనొప్పులు తగ్గే చిట్కాలు!!

సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిదని, సమతుల ఆహారంతో కీళ్లనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. 

చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరాన్ని డీ హైడ్రేటెడ్ కాకుండా చూసుకోవాలని, తగినంత ఎక్కువగా నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు. చలికాలంలో మనకు తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటామని, ఫలితంగా బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుందని, దానివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి అని చెబుతున్నారు. 

చలికాలం చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవాలి. ఎక్కువగా ఉన్న కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు బాధిస్తాయి. కాబట్టి శరీరాన్ని చలికాలం వెచ్చగా ఉంచుకునేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక కీళ్లనొప్పులతో బాధపడేవాళ్లు ముఖ్యంగా చలికాలంలో శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి నొప్పుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. 

Disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. newStone దీనిని ధృవీకరించలేదు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad