Electric Bike Fire Accident: ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు.. పూర్తిగా దగ్దమైన వాహనం
ప్రస్తుతం పెట్రోలు ధరలు ఆకాశానికి తాకడంతో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైకులకు ఆకర్షితులవుతున్నారు. పెట్రోల్ కి నెలవారీ వెచ్చించే డబ్బులు కొత్త ఎలక్ట్రిక్ బైక్ పై ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు స్టాండర్డ్స్ ను మెయింటెన్ చేస్తున్నప్పటికీ మరి కొన్ని కంపెనీలు తూతూ మంత్రంగా సర్వీసులు అందిస్తున్నాయి.
ప్రస్తుతం పెట్రోలు ధరలు ఆకాశానికి తాకడంతో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైకులకు ఆకర్షితులవుతున్నారు. పెట్రోల్ కి నెలవారీ వెచ్చించే డబ్బులు కొత్త ఎలక్ట్రిక్ బైక్ పై ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు స్టాండర్డ్స్ ను మెయింటెన్ చేస్తున్నప్పటికీ మరి కొన్ని కంపెనీలు తూతూ మంత్రంగా సర్వీసులు అందిస్తున్నాయి. గతంలో ఎలక్ట్రిక్ టూవీలర్లలోనే కాదు కార్లలోకూడా అగ్ని ప్రమాదాలు చాలా సంభవించాయి. అయితే వాటికి తమ తప్పిదం లేదని కంపెనీలు చేతులు దులుపుకున్నాయి. తాజాగా మరోసారి ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో పూర్తిగా తగలబడిపోయింది.
మహారాష్ట్ర పింప్రిచించ్ వాడ్ సమీపంలోని బిజిలీనగర్ హనుమాన్ స్వీట్స్ షాపు వద్ద మాగ్నస్ కంపెనీకి చెందిన స్కూటర్ దగ్థమైపోయింది. ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 12.46 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయాన్ని వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందికి అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. MH14ajy0853 రిజిస్ట్రేషన్ గల బైకు మంటల్లో తగలబడిపోవడాన్ని గమనించారు. వెంటనే ఆర్పేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. నీటితో మంటలు ఆర్పేందుకు ఎంత ప్రయత్నం చేసినా బైక్ పూర్తిగా కాలి బూడిదైపోయింది. కేవలం ఇనుప బాడీ తప్ప మిగిలిన భాగాలన్నీ అగ్నికి ఆహుతైయ్యాయి. దీనిపై కంపెనీ స్పందించాల్సి ఉంది. ఎందుకు మంటలు వ్యాపించాయి అనే అంశం ఇంకా వెలుగులోకి రాలేదు.