Current Bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు, చెల్లింపులు అన్నీ తెలుసుకొండిలా..!
మీరు డిస్కం యాప్ ల ద్వారా లేదా ఫోన్ పే యాప్ ల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత పాత చెల్లింపు వివరాలు అవసరం అయితే వాటి వివరాలు అందుబాటు లో లేక, వాటిని వెతకలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలు వాటి చెల్లింపుల వివరాలు ఆడిట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భం లో ఈ పాత చెల్లింపుల వివరాలు అందుబాటులో లేక ఆడిట్ లో అభ్యంతరాలు ఎదుర్కొంటారు.
ఈ ఇబ్బంది ని అధిగమించడానికి డిస్కం ల అధికారిక వెబ్సైట్ ల నుండి మీరు మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు పొందవచ్చు. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులు ఏ విధంగా పాత చెల్లింపుల వివరాలు పొందవచ్చొ తెలుసుకొందాం...
మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు అన్నీ తెలుసుకొండిలా..!
https://www.apeasternpower.com/viewBillDetailsMain ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ సెర్వీసు నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
పై ఫొటో లో 1వ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా ప్రస్తుత నెల బిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా 2వ లింక్ - Consumption and Payment History మీద క్లిక్ చేసి పాత బిల్లుల, చెల్లింపుల వివరాలు పొందవచ్చు.
పై ఫొటో లో చూపించిన విధంగా... కావల్సిన ఆర్థిక సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం (1) ద్వారా ఆ ఆర్థిక సంవత్సరం బిల్లులు, చెల్లింపుల వివరాలు పొందవచ్చు.
2లో చూపించిన విధంగా PDF Download మీద క్లిక్ చేసి మొత్తం ఆ సంవత్సరం లో బిల్లులు చెల్లింపుల వివరాలు ఈ క్రింద చూపిన్ ఇమేజ్ లో చూపిన విధంగా పొందవచ్చు.
3లో చూపించిన విధంగా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే బిల్ పూర్తి వరాలు పొందవచ్చు.
4లో చూపించిన విధంగా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే చెల్లింపుల పూర్తి వరాలు పొందవచ్చు.
ఈ విధంగా మీ కార్యాలయ లేదా మీ ఇంటి కరెంట్ బిల్లులు, చెల్లింపుల వివరాలు కావాలసిన సంవత్సరానికి పొందవచ్చు
ఇతర డిస్కం ల వెబ్సైట్ లింక్ లు