Caste Survey in Andhra Pradesh - కుల గణన పూర్తి సమాచారం
AP Caste Census Survey Updates :
- గతంలో 1931వ సంవత్సరంలో కుల గణన సర్వే జరిగింది.
- నవంబర్ నెల 27 నుంచి కులగణన ( Caste Enumeration Survey - Caste Census Survey 2023 ) ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 3 న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కుల గణన ( AP Caste Survey 2023) కు ఆమోదం ఇచ్చింది. దీన్ని డిజిటల్ విదానంలో చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్ను సిద్ధం చేస్తోంది.
- ఎన్యుమరేటర్లుగా గ్రామా వార్డు సచివాలయ సిబ్బంది వ్యవహరిస్తారు .
- సచివాలయ సిబ్బంది , మండల సిబ్బంది వారికి నవంబర్ 20 నుంచి మొదలు అయ్యి 22 వరకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగును .
- మొత్తం 5 ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. నవంబర్ 17 న రాజమండ్రి , కర్నూల్ లో 20న విశాఖపట్నం , విజయవాడ లో , 24న తిరుపతి లో ప్రాంతీయ సదస్సులు జరుగుతాయి . అందులో కుల గణన పై చర్చలు జరగనున్నాయి .ప్రాంతీయ సదస్సులు జరిగిన జిల్లాలో జిల్లా స్థాయి సదస్సులు జరగవు
- గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది,గ్రామా వార్డు వాలంటీర్ల ద్వారా ఈ గణన నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
- ఈ కార్యక్రమాన్ని సమర్థంగా పూర్తిచేసేందుకు ప్రాంతీయ, జిల్లా స్థాయి సమావేశాలు/సదస్సులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీనికి కుల సంఘాలు, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, మేధావులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి సూచనలను స్వీకరించాలని స్పష్టం చేసింది. వారిని ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్ నేతృత్వలోని కమిటీకి అప్పగించింది.
- సదస్సులను విజయవంతంగా నిర్వహించే డానికి వ్యాఖ్యాతలు మోడరేటర్లను ఎంపిక చేయాలని సూచించింది. సమా వేశాలు వివాదాస్పదం కాకుండా ఉండేందుకు వారు నిర్దేశించిన అంశానికే పరిమితమై మాట్లాడేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కుల గణన షెడ్యూల్ ఏమిటి ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నవంబర్ 27, 2023 నుండి ప్రారంభం అయ్యి ఒక వారంలోపు సర్వే పూర్తి అవుతుంది. సర్వే చెయ్యని వారికి మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని కుటుంబ సభ్యులకు సర్వే చేయుటకు చివరి తేదీ డిసెంబర్ 10 2023. కుల గణన సర్వే ఒక ఫేస్ లో మాత్రమే జరుగుతుంది. కుల గణన సర్వేకు నోడల్ డిపార్ట్మెంట్ గా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉంటుంది.
సర్వే ఎలా ఉండబోతుంది ?
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. సర్వే అనేది పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. సర్వే చేయు సమయంలో ప్రజల నుంచి డాక్యుమెంట్ విషయంపై ఒత్తిడి లేకుండా సమాచారాన్ని తీసుకోవలసి ఉంటుంది. సేకరించిన సమాచారానికి సంబంధించి గొప్యత పై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం.కుల గణన ( Caste Survey Process ) చేయు విధానం
సర్వే మొబైల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది?
- కులగనన సర్వేకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ శాఖ కొత్త మొబైల్ అప్లికేషన్ను డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ అప్లికేషన్లో
- ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను ప్యూరిఫై చేసి చూపించడం జరగను.
- ప్రభుత్వ వద్ద ఉన్న డేటా బేస్ లో కవర్ అవ్వని కొత్త కుటుంబ సభ్యులను మరియు హౌస్ లను జోడించుటకు ఆప్షన్ ఇవ్వటం జరుగును.
- డోర్ లాక్ / తాత్కాలికంగా బయటకి వెళ్లినవారు / ఆసుపత్రిలో ఉన్నవారికి ప్రత్యేక ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది.
- శాశ్వత వలసలో ఉన్నవారికి, సంచార సమూహాలకు, డోర్ లాక్ కేసెస్కు ప్రత్యేక ఆప్షన్ ఇవ్వటం జరుగును.
- గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆనులైనలో డేటా కలెక్షన్ చేయడం జరుగును.
కుల గణన సర్వేలో ఏ ఏ ప్రశ్నలు ఉంటాయి ?
సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వివిధ డిపార్ట్మెంట్లను కలగలిపి కొని ప్రశ్నలను సిద్ధం చేయడం జరుగును. ప్రజలకు సంబంధించి పేరు,వయసు,లింగము, వ్యవసాయ భూమి, నివాస భూమి, పశుసంపద, వృత్తి సమాచారం, వివిధ మార్గాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయము, కులము, ఉపకులము ,మతము, విద్యా అర్హతలు, ఇంటి రకము, సురక్షిత త్రాగునీరు మరియు టాయిలెట్లు, గ్యాస్ అందుబాటు పై ప్రశ్నలు ఉంటాయి.
కుల గణన సర్వేలో అడిగే ప్రశ్నలు - Caste Survey Questionnaire :
Section - 1
- ప్రస్తుత జీవనస్థితి (సర్వేకి అందుబాటులో ఉన్నారు / మరణించి ఉన్నారు)
కుటుంబ ప్రాథమిక వివరాలు
- జిల్లా పేరు (ఆటోమేటిక్ గా వస్తుంది )
- జిల్లా కోడు (ఆటోమేటిక్ గా వస్తుంది )
- మండలం / మున్సిపాలిటీ / మున్సిపల్ కార్పొరేషన్ పేరు (ఆటోమేటిక్ గా వస్తుంది )
- మండలం / మున్సిపాలిటీ / కార్పొరేషన్ కోడు
- పంచాయితీ (ఉన్న లిస్ట్ లో ఎంచుకోవాలి )
- పంచాయతీ కోడు (ఆటోమేటిక్ గా వస్తుంది )
- వార్డు నెంబరు (ఎంటర్ చేయాలి )
- హౌస్ నెంబరు (ఎంటర్ చేయాలి )
హౌస్ ఓల్డ్ వివరాలు
- కుటుంబ పెద్ద పేరు (ఉన్న లిస్ట్ లో ఎంచుకోవాలి )
- కుటుంబ పెద్ద ఆధారు నెంబర్ (ఆటోమేటిక్ గా వస్తుంది )
- కుటుంబ పెద్దతో కలిపి ఇంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య (ఎంటర్ చేయాలి )
- కుటుంబ సభ్యుల పేర్లు (ఆటోమేటిక్ గా వస్తుంది )
- కుటుంబ సభ్యులకు కుటుంబ పెద్దతో బంధుత్వం (ఎంటర్ చేయాలి )
- ప్రస్తుత చిరునామా (ఆటోమేటిక్ గా వస్తుంది )
- రైస్ కార్డు నెంబరు (ఎంటర్ చేయాలి, లేని వాటికి విడిచి పెట్టవచ్చు )
- ఇంటి రకము ( రేకు ఇల్లు / పూరి గుడిసా / డాబా ఇల్లు /డూప్లెక్స్ హౌస్ /అపార్ట్మెంట్లో ఇల్లు ) మరుగుదొడ్ల సదుపాయం (సొంత మరుగుదొడ్లు / పబ్లిక్ టాయిలెట్ / ఆరుబయట )
- త్రాగునీటి సదుపాయము ( మునిసిపల్ టాప్ / పంచాయతీ టాపు / పబ్లిక్ టాపు / బోర్వెల్ / చెరువు / పబ్లిక్ బోర్వెల్ / ప్యాకేజ్ వాటర్ )
- గ్యాస్ సదుపాయము ( LPG / Gas / కిరోసిన్ /కర్రలు పొయ్యి / బయోగ్యాసు / ఇతర )
- పసుసంపద సమాచారము ( ఆవు / గేదె / మేక / గొర్రె / పందులు /ఇతర పౌల్ట్రీ )ఎన్ని ఉన్నాయో కౌంట్ వెయ్యాలి
Section - 2
కుటుంబ సభ్యుల వివరాలు
- కుటుంబ సభ్యుని పేరు (ఆటోమేటిక్ గా వస్తుంది )
- తండ్రి లేదా భర్త పేరు (ఎంటర్ చేయాలి )
- లింగము (ఆటోమేటిక్ గా వస్తుంది )
- పుట్టిన తేదీ (ఆటోమేటిక్ గా వస్తుంది )
- వివాహ స్థితి (ఎంటర్ చేయాలి )
- కులము (ఏపీ సేవ లో సర్టిఫికెట్ తీసుకొని ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది లేదంటే లిస్ట్ లో ఎంచుకోవాలి )
- ఉప కులము (ఏపీ సేవ లో సర్టిఫికెట్ తీసుకొని ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది లేదంటే లిస్ట్ లో ఎంచుకోవాలి )
- మతము (ఎంటర్ చేయాలి )
- విద్యా అర్హత (ఎంటర్ చేయాలి )
- వృత్తి (ఎంటర్ చేయాలి )
- పంట భూమి (ఎంటర్ చేయాలి )
- నివాస భూమి (ఎంటర్ చేయాలి )
- Note : ప్రతి కుటుంబానికి సర్వే పూర్తి చేసిన తర్వాత సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్ బయోమెట్రిక్ వేయాలి.ఆలా అయితేనే Final submit అవుతుంది.
డేటాను సేకరించడానికి ఉన్నటువంటి మార్గదర్శకాలు
- గ్రామ వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు కలిపి సర్వే చేయవలసి ఉంటుంది.
- ప్రతి ఇంటికి సర్వే పూర్తి అయిన వెంటనే వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగుల ఈ కేవైసీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
- సర్వే ఇంటికి పూర్తి చేయడానికి ఇంటిలో కుటుంబ సభ్యుల ఈ కేవైసీ తప్పనిసరి. 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు మినహాయింపు ఉంటుంది.
- మండలం డివిజనల్ మరియు జిల్లా స్థాయి అధికారులు వెరిఫికేషన్ ఆఫీసర్లుగా ఉంటారు.
పైలెట్ సర్వే ఎలా ఉంటుంది
- పైలెట్ సర్వే చేయడం ద్వారా మొబైల్ అప్లికేషన్ మరియు వివిధ సమస్యలపై అవగాహన వస్తుంది. దానికి అనుగుణంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ మొబైల్ అప్లికేషన్లో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది.
- పైలెట్ సర్వేను ఐదు సచివాలయాల్లో అందులో గ్రామాల్లో మూడు సచివాలయాలు అర్బన్ లో రెండు సచివాలయంలో చేయడం జరుగును.
- పైలెట్ సర్వే అనేది నవంబర్ 16,2023 లోపు పూర్తి అవుతుంది.
Caste Census Survey 2023 Downloads :
Sachivalayam Staff - Volunteers Tagging Office Order Soft Copy
CS Meeting Copy