Trending

6/trending/recent

Margadarshi Chitfund Notice: మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులు నోటీసు !!

Margadarshi Chitfund Notice: మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులు నోటీసు !!

మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల 37 శాఖల యందు నిర్వహిస్తున్న చిట్స్ నిర్వహణ, చిట్ ఫండ్ యాక్ట్ మేరకు నిర్వహిస్తున్నారా? లేదా అనే అంశం మీద పర్యవేక్షణ అధికారం కలిగిన అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్ఫండ్స్ వారు తమ అధికారిక విధులలో భాగంగా చేసిన విచారణలో నేరపూరిత అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. ఇదే అంశంలో కొన్ని శాఖల అధికారులు చేసిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర సి.ఐ.డి. వారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై కేసులు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తును చేపట్టారు.

Margadarshi Chitfund Notice: మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులు నోటీసు !!

అసిస్టెంట్ రిజిస్ట్రార్ వారు చేసిన విచారణలో వివిధ బ్రాంచీలు నిర్వహిస్తున్న వివిధ చిట్ గ్రూపుల్లో అనేక అవకతవకలు, నిధుల మళ్లింపు, ఏపీ చిట్ ఫండ్ యాక్ట్- 1982, ఏపీ చిట్ ఫండ్ రూల్స్-2008 చట్టఉల్లంఘనలకు పాల్పడినట్లుగా గుర్తించారు. వీటి వివరాలు మీ సౌకర్యం కోసం క్రింద పేర్కొన్న వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది. అందులో ప్రాథమికంగా గుర్తించిన ముఖ్య ఉల్లంఘనలు ఇవి..

1. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఉన్న టికెట్సుకు, కంపెనీవారు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఈ గ్రూపుకు సంబంధంలేని సభ్యులు (వేరే చిట్స్ గ్రూపు) చెల్లించిన చందా డబ్బుతో చెల్లింపులు పూర్తి చేసారు. ఇది చట్ట ఉల్లంఘన. నియమావళి మేరకు కంపెనీ అధీనంలోని టికెట్సు (వెకేట్ చిట్స్) కు మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ వారు, సొంత నిధులతో మాత్రమే చెల్లింపులు చేయాలి..

2. ఇలా చిట్ కంపెనీ వారు చెల్లించాల్సిన చెల్లింపులు చేయకుండా వేరే గ్రూపుకు సంబంధించిన చందాదారుల డబ్బులను దారి మళ్లించడం వల్ల, పాట పాడుకున్న చందాదారులకు చాలా ఆలస్యంగా చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించడమైనది. చిట్ పాటాదారులకు కొన్ని సందర్భాలలో నాలుగు నెలలకు మించి చెల్లింపులు ఆలస్యం చేశారు.

3. నూతన చిట్ ప్రారంభించే సమయంలో తగు అనుమతులు పొందకుండా చిట్ మెంబర్స్ నుంచి ఎలాంటి మొత్తాలు స్వీకరించకూడదు. కానీ చిట్ ఫండ్ నియమావళిని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా పబ్లిక్ నుంచి నిధులు స్వీకరించడం జరిగింది.

4. చిట్ గ్రూపులోని చందాదారులు వారి అవసరాలకు చిట్ పాట పాడుకోగా, వారికి సకాలంలో చిట్ మొత్తాన్ని చెల్లించకుండా చిట్ నిబంధనలు పేరుతో సరైన హామీలను సెక్యూరిటీ) సమర్పించలేదనే కారణంతో మరియు వడ్డీ ఆశ చూపించి భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాకు హామీగా (సెక్యూరిటీగా) చిట్ మొత్తాన్ని కంపెనీ వద్దే డిపాజిట్ చేసుకొని 4% లేదా 5% వడ్డీ చెల్లిస్తామని రశీదులు ఇచ్చి ఎలాంటి మొత్తాలు చిట్ పాడుకున్న వారికి చెల్లించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.

5. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ శాఖకు చెందిన ఖాతా నిర్వహణ చిట్ నియమావళి మేరకు ఆ శాఖకు సంబంధించిన ఫార్మెన్ ఆధీనంలో ఉండాలి. కాని ఈ శాఖలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల నిర్వహణ ఆ శాఖ ఫార్మెన్ కాకుండా వారి కేంద్ర కార్యాలయంలో పనిచేసే అనధికార సిబ్బందిచే నిర్వహిస్తూ చిట్ నిధులను చట్ట విరుద్ధంగా దారి మళ్ళిస్తున్నారు.

6. చందా చెల్లింపులలో డీ-ఫాల్ట్ అయిన లేదా ఎలాంటి చందా చెల్లించని వారి పేరు మీద చిట్ పాట పాడి నిబంధనలకు విరుద్ధంగా సదరు మొత్తాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.

7. చిట్ఫండ్ చట్టం 1982 లోని సెక్షన్ 24 మరియు రూల్ 28 నిబంధన మేరకు సమర్పించాల్సిన బ్యాలన్స్ షీట్, ప్రొఫిట్ & లాస్ అకౌంట్ షెడ్యూల్ 1, 2 మేరకు, సంబంధిత పర్యవేక్షణ అధికారులకు సమర్పించవలసి ఉన్నప్పటికీ ఎలాంటి బ్యాలన్స్ షీట్లు, ప్రాఫిట్ & లాస్ అకౌంట్లు సమర్పించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు.

చందాదారుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్ఫండ్స్ వారు మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు చిట్ ఉల్లంఘనలకు పాల్పడిన చిట్ గ్రూపుల వివరాలు వెబ్ సైట్లో (https://registration.ap.gov.in/....) పేర్కొంటూ అసి స్టెంట్ రిజిస్ట్రార్ వారి నివేదికను పరిగణనలోకి తీసుకొని ఈ గ్రూపులను రద్దు పరచాలని ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. ఈ విషయంలో చిట్ గ్రూపు మెంబర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజులలోగా సదరు చిట్ గ్రూపునకు అనుమతులు మంజూరు చేసిన డిప్యూటీ రిజిస్ట్రార్, చిట్ ఫండ్స్ వారికి లిఖిత పూర్వకంగా తెలియజేయవలసినదిగా కోరడమైనది.

చందాదారుల అభ్యంతరాలు/అభిప్రాయాలు వెబ్ సైట్లో సూచించిన విధంగా సంబంధిత డిప్యూటీ రిజిస్ట్రార్లకు ఈ-మెయిల్ ద్వారా తెలపగలరు.

సం/- రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, ఆంధ్రప్రదేశ్

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad