Trending

6/trending/recent

AWP&B School , Habitation , Complex , Mandal Development Plan Formats 2023-2024 Released

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ

జాతీయ విద్యా విధానం – 2020

AWP&B School , Habitation , Complex , Mandal Development Plan Formats 2023-2024 Released
AWP&B School , Habitation , Complex , Mandal Development Plan Formats 2023-2024 Released

2020 జూలై 29న భారత ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని 2020-21 వరకు ఆమోదించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో నాలుగోదైన గుణాత్మక విద్యను సాధించడమే లక్ష్యంగా ఈ విద్యా విధానం రూపొందించబడింది.

విలువలతో కూడిన అత్యుత్తమ విద్యను అందిస్తూ ప్రపంచ విజ్ఞాన శాస్త్రంలో తిరుగులేని శక్తిగా మన దేశాన్ని మార్చి 21వ శతాబ్దపు అభివృద్ధి అవసరాలపై దృష్టి పెట్టడమే విద్యావిధానం యొక్క విశేషం.

ఈ విద్యా విధానం పాఠశాల విద్య మరియు ఉన్నత విద్యలకు సంబంధించిన సిఫార్సులతో ముందుకు వచ్చింది. పాఠశాల విద్యకు సంబంధించి 8 అంశాలను గుర్తించింది. అవి

1) పూర్వ బాల్యదశ రక్షణ మరియు విద్య,

2) పునాది విద్య-  సంఖ్యాశాస్త్రం,

3) బడి మానేవేసిన విద్యార్థుల శాతాన్ని తగ్గించి అన్ని స్థాయులలో సార్వత్రిక    విద్యను అందించడం.

4) పాఠశాలలు ప్రణాళిక బోధన: అభ్యసన సమగ్రంగా సమ్మళితంగా ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉండేటట్లు చూడటం

5) ఉపాధ్యాయులు

6) సమానమైన మరియు సమగ్ర విద్యను అందరికీ అందించడం

7) పాఠశాల సముదాయాల ద్వారా సమర్థవంతమైన వనరులు మరియు పాలన

8) పాఠశాల విద్యకు ప్రామాణిక అమరిక మరియు  అక్రిడేషన్.

దేశమంతటా ఈ విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం భారత ప్రభుత్వం ‘స్టూడెంట్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అచివ్ మెంట్స్  (SARTHAQ) ప్రణాళికను విడుదల చేసింది. ఈ ప్రణాళిక రాబోయే పది సంవత్సరాలకు జాతీయ విద్యా విధానం అమలు కోసం రోడ్ మ్యాపును మరియు ముందుకు వెళ్లే మార్గాన్ని వివరిస్తుంది. 

Download School Development Plan Click Here

Download Habitation Development Plan Click Here

Download Cluster Development Plan Click Here

Download Mandal Development Plan Click Here

Download NEP 2020 Click Here

Download PPT on Webex held on 04.01.2023 Click Here

1) పూర్వ బాల్యదశ రక్షణ మరియు విద్య

బిడ్డ యొక్క మేధో వికాసం 85 శాతానికి పైగా మొదటి 6 సంవత్సరాలలో జరుగుతుంది కాబట్టి ఆరోగ్యకమైన వికాసానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ తగిన శ్రద్ధ వహించాలి. అందుకు అనుగుణంగా ప్రతి బిడ్డకు  నాణ్యమైన పూర్వబాల్యదశ రక్షణ, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి కుటుంబాలలో ఇది జరగడం లేదు. 2030 నాటికి పూర్వబాల్యదశ రక్షణ, విద్యను సార్వత్రికంగా అందుబాటులోకి తీసుకువచ్చి పిల్లలందరూ ఒకటవ తరగతిలో పాఠశాలలో చేరడానికి అవకాశం కల్పించాలి.

ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ/ విద్యా సంస్థ పూర్వప్రాథమిక విద్యను సమర్థవంతంగా అందించడం లేదు.  మన రాష్ట్రంలో 55వేల పైచిలుకు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇవి గ్రామీణ పిల్లల సంరక్షణ కేంద్రాలుగా వారి ఆకలి మరియు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొవడానికి ప్రారంభించబడి ఆయా లక్ష్యాలను సాధించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. ఒక సాధారణ అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు పూర్వ ప్రాథమిక విద్యా కార్యకలాపాలు కూడా ఇమిడి ఉన్నప్పటికినీ అనధికారిక పూర్వప్రాథమిక విద్యను మాత్రమే అందించగలుగుతున్నాయి.

ఈ కొత్త జాతీయ విద్యావిధానం పూర్వ  ప్రాథమిక విద్య కోసం నాలుగు దశల వ్యూహాన్ని సూచించింది. అవి

1) ఒంటరిగా ఉన్న అంగన్వాడీలు

2) ప్రాథమిక పాఠశాలలతో కలిసి ఉన్న అంగన్వాడీలు

3) పూర్వ ప్రాథమిక తరగతులు ఉన్న ప్రాథమిక పాఠశాలలు

4) ఒంటరిగా ఉన్న పూర్వ ప్రాథమిక పాఠశాలలు.

మన రాష్ట్రంలో సుమారు 11,500 అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలో  నడుస్తున్నాయి. మిగిలినవి ఒంటరిగా ఉన్నాయి. పూర్వప్రాథమిక విద్య కలిగిన పాఠశాలలు కాని, ఒంటరిగా ఉన్న పూర్వ ప్రాథమిక పాఠశాలలు కాని మన రాష్ట్రంలో లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల పరివర్తన తీసుకురావడానికి జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా అనేక కార్యకలాపాలు అంకితభావంతో చేపట్టింది.  

ఉదాహరణకు: జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద మరియు మన బడి: నాడు- నేడు.

మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో పిల్లల కోసం వారి బాల్యాన్ని రక్షిస్తూ వారికి పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ‘వైయస్సార్ పూర్వప్రాథమిక పాఠశాలలు’గా రూపొందించడానికి నిర్ణయం తీసుకోవడమైనది. పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి విద్య ప్రణాళిక మరియు పాఠ్యాంశాలను రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ ((SCERT)  ఇప్పటికే రూపొందించింది.

ప్రస్తుతం మన పాఠశాలల్లో అభ్యాస సంక్షోభం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు వయస్సుకు తగిన అభ్యసన ఫలితాలను పొందలేకపోతున్నారు.  ఈ తరుణంలో మనం పునాది విద్య వైపు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

2) పునాది విద్య - సంఖ్యాశాస్త్రం

భవిష్యత్తులో పాఠశాల విద్యకు, జీవిత కాల అభ్యసనానికి సంసిద్ధతా విద్య అత్యవసరమైనది. చదవగలగడం, రాయగలగడం, ప్రాథమిక గణిత భావనలలో అవగాహన అత్యవసరం. వివిధ సర్వేల ప్రకారం ప్రస్తుతం మన విద్యార్థులు అభ్యసనలో వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించి విద్యార్థులలో పునాది విద్యకు ప్రాధాన్యత ఇస్తూ వయస్సుకు తగిన అభ్యసన ఫలితాలను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. అవే ‘ఫౌండేషనల్ స్కూల్స్’ ఏర్పాటు. ప్రస్తుతం మన రాష్ట్రంలో (33,676) ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 17.8 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పరిశీలిస్తే 60 కంటే తక్కువ విద్యార్థుల గల పాఠశాలలు 21,880 అనగా 65 శాతం. ఈ పాఠశాలలలో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు ఐదు తరగతులకు అనగా ఒకటి నుంచి 5తరగతులకు 18 సబ్జెక్టులలో విద్యా బోధన చేస్తున్నారు. దీనివల్ల ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసనంపై దృష్టి సారించలేకపోతున్నారు. దీనివల్ల ముఖ్యంగా    1 మరియు 2వ తరగతుల విద్యార్థులలో అభ్యాస లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రభావం వారి జీవిత కాల విద్యాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 1,2 తరగతులకు ప్రత్యేకంగా  విద్యాభ్యాసన మరింత సరళంగా మరియు అభ్యసన ఫలితాలను సాధించే విధంగా పాఠశాల సంసిద్ధత తరగతితో అనుసంధానం చేస్తూ ‘ఫౌండేషనల్ స్కూల్’ గా వ్యవస్థీకరించడానికి సూత్రప్రాయంగా ప్రతిపాదించడమైనది. ఆయా పాఠశాలల్లో చదివే 3-5వ తరగతి విద్యార్థులను దగ్గరిలోని ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలకు అనుసంధించాలని భావించడమైనది. తద్వారా 1,2 తరగతుల విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థులలోని వైయుక్తిక బేధాలను గమనిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు అభ్యాస మార్గాన్ని ఏర్పాటు చేయవచ్చు.

3 నుంచి 5వ తరగతి విద్యార్థులు దగ్గరలోని ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలకు అనుసంధానం చేయడం వల్ల వారికి మరింత బోధనా నైపుణ్యం, విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులతో బోధనాభ్యస సౌకర్యం కలుగుతుంది. విషయనిపుణులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. అంతేకాక విశాలమైన ఆటస్థలం, ల్యాబ్, లైబ్రరీ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు కొత్త వాతావరణంలో మరింత గుణాత్మక విద్యను పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రస్తుతం 33,676 ప్రాథమిక పాఠశాలల్లో 3 నుండి 5 తరగతులు చదివే విద్యార్థుల సంఖ్య 11 లక్షలు. వీరిలో 17,600 ప్రాథమిక పాఠశాలల నుండి 7 లక్షల మంది విద్యార్థులను అంటే 63 శాతం మంది విద్యార్థులను ఒక కిలో మీటరు లోపు ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలకు అనుసంధానం చేయవచ్చు. అలాగే 6,900 పాఠశాలల నుండి 2 లక్షల మంది విద్యార్థులను అంటే 18 శాతం మందిని 2 కిలో మీటర్లు లోపు గల ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలకు అనుసంధానం చేయవచ్చు. అలానే 5,000 పాఠశాలల నుండి లక్షా 30 వేలమంది విద్యార్థులను అంటే 12 శాతం మందిని 3 కిలోమీటర్లలోపు ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలకు అనుసంధానం చేయవచ్చు. కేవలం 3,700 పాఠశాలల్లో 76వేలమంది అంటే 8 శాతంమందికి 3 కిలోమీటర్లలోపు ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేవు. అంతేకాక 5,200 పాఠశాలల నుండి 3,850 ఉన్నత పాఠశాలలకు 2లక్షల 17 వేల మంది విద్యార్థులను ఎటువంటి అదనపు తరగతి గదులు అవసరం లేకుండా అనుసంధానం  చేయవచ్చు. ఈ ప్రక్రియ ఈ విద్యా సంవత్సరంలోనే చేపట్టవచ్చు. మరొక 5,000 ప్రాథమిక పాఠశాలల నుండి 2,300 ఉన్నత పాఠశాలలకు 3 లక్షల 25 వేలమంది విద్యార్థులను అనుసంధానం చేయడానికి 9,800 అదనపు తరగతి గదులు అవసరమవుతాయి. ఈ ప్రక్రియను తదుపరి విద్యా సంవత్సరం నాటి నుండి చేపట్టవచ్చు. దీనివల్ల రాబోయే రెండు సంవత్సరాలలో 50 శాతం మంది విద్యార్థులు 3 నుంచి 5 తరగతుల విద్యార్థులను దగ్గరలోని ఉన్నత పాఠశాలలకు అనుసంధానించడం ద్వారా 727 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరణం చెందుతాయి. అలానే 989 రెసిడెన్షియల్ పాఠశాలలు (కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ తో సహ) బలపడతాయి. మొత్తమ్మీద 7,200 పాఠశాలలు అత్యున్నత నాణ్యత ప్రమాణాలు కలిగిన పాఠశాలలుగా రూపొందించబడతాయి. వీటిని మనం నేటి ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ స్కూల్స్’గా పిలుచుకోవచ్చు.

3) బడి మానేవేసిన విద్యార్థుల శాతాన్ని తగ్గించి అన్ని స్థాయులలో సార్వత్రిక విద్యను అందించడం.

బడి బయట పిల్లల వివరాల కోసం ఒక సమగ్ర సర్వేను నిర్వహించి వారిని ఆయా వయస్సులకు అనుగుణంగా తగిన తరగతుల్లో చేర్పించడానికి ‘సమగ్ర శిక్షా’  ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోబడతాయి.

4) పాఠశాలలు ప్రణాళిక బోధన: అభ్యసన సమగ్రంగా సమ్మళితంగా ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉండేటట్లు చూడటం

ప్రస్తుతం మన రాష్ట్రంలో 10+2 విద్యా ప్రణాళిక అమలులో ఉంది. జాతీయ విద్యా విధానం సిఫార్సుల ప్రకారం పాఠశాల విద్యా ప్రణాళిక , బోధనను నూతన ఆకృతిలోకి మార్పు చేయాలి. వివిధ స్థాయిలలో అభివృద్ధికి అనుగుణంగా 3-8, 8-11, 11-14, 14-18 సంవత్సరాల వారికి అభివృద్ధి అవసరాలకు, విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేయాలి. పాఠశాల విద్య పాఠ్య ప్రణాళిక, బోధనా విధానం, పాఠ్య ప్రణాళిక చట్రం రూపకల్పన, 5+3+3+4 పద్ధతిలో ఉండాలి. అంటే పునాది విద్య   (3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య, 1,2 తరగతులు) సంసిద్ధత (3 నుండి 5 తరగతులు), మాధ్యమిక విద్య     (6 నుండి 8 తరగతులు), ఉన్నత పాఠశాల విద్య (9 నుండి 10 మొదటి దశ, 11 నుండి 12 రెండవ దశ).

5) ఉపాధ్యాయులు 

విద్యార్థి : ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం మరియు విస్తరణను చేపట్టడం, ఉపాధ్యాయుల్లో సేవా వాతావరణం మరియు సంస్కృతిని పెంచడం, నిరంతర వృత్తి అభివృద్ధి కోసం పాటుపడటం, ఉపాధ్యాయుల్లో వృత్తి పరమైన ప్రమాణాలను పెంపొందించడం, ఉపాధ్యాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గుణాత్మక విద్యను అందించడానికి అర్హులైన ఉపాధ్యాయులను పొందవచ్చును.

6) సమానమైన మరియు సమగ్ర విద్యను అందరికీ అందించడం

సమగ్ర శిక్షా ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపకరణాలను అందిస్తూ వారిలో కూడా అభ్యసన ఫలితాలను సాధించడం, బోధనాభ్యసన ప్రక్రియకు అందరూ సమానమేనని కుల, మత, విచక్షణ లేకుండా సోదరభావంతో అందరికీ గుణాత్మకమైన విద్యను సమగ్రంగా అందించడం.

7) పాఠశాల సముదాయాల ద్వారా సమర్థవంతమైన వనరులు మరియు పాలన

ప్రస్తుతం మన రాష్ట్రంలో 4,000 పాఠశాలల సముదాయాలు ఉన్నాయి. వీటి ద్వారా ఉపాధ్యాయులకు బోధనాపరమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయులు వారి వారి బోధనా నైపుణ్యాలను పంచుకోవడానికి ఒక వేదికగా సమర్థవంతమైన పాలనను సాగించడానికి ఒక వనరుగా ఉంది. వీటిని మరింత బలోపేతం చేసి సమర్థవంతమైన వనరులు అందించడం ద్వారా సమగ్రమైన పాలనను ఆశించడం.

8) పాఠశాల విద్యకు ప్రామాణిక అమరిక మరియు  అక్రిడేషన్

మన రాష్ట్ర ప్రభుత్వం Act 21, 2019 ద్వారా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య  నియంత్రణ మరియు పర్యవేక్షణ కమీషన్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రమాణాలను ఉండేటట్లు చూడటం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ మరియు పర్యవేక్షించడం ద్వారా విద్య యొక్క వాణిజ్యీకరణను ఆపడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల పరివర్తన కోసం జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు అంకితభావంతో ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేస్తూ సఫలీకృతమైంది. మరిన్ని సిఫార్సులను రాబోయే కాలంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని ప్రపంచ పౌరుడిగా తీర్చిదిద్దడానికి తగిన అవకాశాలను కల్పిస్తూ విద్యార్థుల సర్వతోమఖాభివృద్ధికి కృషి చేస్తుంది.

Download School Development Plan Click Here

Download Habitation Development Plan Click Here

Download Cluster Development Plan Click Here

Download Mandal Development Plan Click Here

Download NEP 2020 Click Here

Download PPT on Webex held on 04.01.2023 Click Here

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad