Webex Meeting Details : 18వ తేదీన డి.ఈ.ఓ లతో జరిగిన వెబెక్స్ మీటింగ్ విశేషాలు
newStoneJuly 18, 2022
0
Webex Meeting Details : 18వ తేదీన డి.ఈ.ఓ లతో జరిగిన వెబెక్స్ మీటింగ్ విశేషాలు
జగనన్న విద్యా కానుక
జగనన్న విద్యా కానుక లో లో అన్ని ఆ అంశాలతో కూడిన రిట్టుస సు మాత్రమే బయోమెట్రిక్ ద్వారా సరఫరా చేయాలి.
అనివార్య కారణాలవల్ల యూనిఫామ్ క్లాత్ మరియు బూట్లు లేట్ అయినవి, కాబిట్టి ఆ రెండు మినహా మిగతా ఐటమ్స్ తో ఈనెల 25 లోపు పంపిణీ పూర్తి చేయాలి.
ది. 25.07.2022 తర్వాత యూనిఫామ్ మరియు బూట్లు తో కలిపి జగనన్న విద్యా కానుక పూర్తిస్థాయిలో అందజేయాలి.
పాఠశాల మేనేజ్మెంట్ గ్రాంట్
2020 - 21, 2021-22 విద్యా సంవత్సరాలలో పాఠశాల మేనేజ్మెంట్ గ్రాంట్ జమ కాని పాఠశాలల సంఖ్య అధికంగా ఉన్నది.వాని తాలూకు రూ.110 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి.
ప్రధానోపాధ్యాయులు ది: 20. 07.2022 లోపు పి ఎఫ్ ఎం ఎస్ ఖాతాలు తెరిచిన చో నిధులు వెంటనే సంబంధిత ఖాతాలలో జమ అవుతాయి.
కావున ప్రధానోపాధ్యాయులు 420 సిబ్బంది మరియు సిఆర్‌పి లతో సహకరించి మూడు దశల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పిఎఫ్‌ఎంఎస్ ఖాతాలు సిద్ధంగా ఉంచాలి.
పిఎఫ్‌ఎంఎస్ ఖాతాలు లేనిచో ఎట్టి పరిస్థితులలో నిధులు జమ కావు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా “హర్ ఘర్ కా జండా” కార్యక్రమం ఆగస్టు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరపవలెను.
ఈ సందర్భంగా * విలేజ్ ప్రభాత్ భేరీ” అనే కార్యక్రమం ప్రతి గ్రామం, ఆవాస ప్రాంతంలో, పట్టణంలో నిర్వహించాలి.
సంబంధిత ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ విధిగా విలేజ్ ప్రభాత్ భేరీ” లో పాల్గొనాలి.
వేకువజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ వీధులలో ఊరేగింపుగా ప్రజలను చైతన్యపరచాలి.
“అమృత్ సరోవర్” కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో 390 ప్రాంతాలు గుర్తించబడ్డాయి. సంబంధిత “అమృత్ సరోవర్” కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు విధిగా పాల్గొనాలి.
జండా తో సెల్ఫీ ఫోటో దిగి “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” పోర్టల్ లో అప్ లోడ్ చేసినట్లయితే సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. సర్టిఫికెట్ ను విద్యార్థిని విద్యార్థులు భద్రపరుచుకోవాలి.
ఆగస్టు 13, 14, 15 తేదీలలో ప్రతి ఇంటి మీద, ప్రభుత్వ , ఫైవేటు కార్యాలయాల మీద జాతీయ జెందా ఎగురవేయాలి.
దేశభక్తి గీతాలు ఆలపిస్తూ మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్చించిన వీరుల గాథలను గుర్తుచేసుకోవాలి.
స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్చించిన వీరులకు సంబంధించిన కళారూపాలు, చిత్రాలు మొదలగునవి ప్రదర్శించాలి.
ప్రతి ఇంటా, ప్రతి వ్యక్తీ, ప్రతి విద్యార్ధి “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” _కార్యక్రమాలలో పాల్గొనాలి.
స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన కథలు, చిత్రాలు విరివిగా ప్రదర్శిస్తూ అందరినీ ఉత్తేజపరచాలి. “హర్ ఘర్ కా జండా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.