Trending

6/trending/recent

Viral: సముద్ర తీరానికి వెళ్లిన మనిషి మిస్సింగ్.. ఉబ్బిన కడుపుతో కనిపించిన మొసలి.. దాన్ని పట్టి.. పొట్ట చీల్చగా

 నీటిలో ఉంటే మొసలి ఎంత బలీయంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్థానబలం వల్ల అది భారీ ఏనుగును కూడా పడగొట్టగలదు. అందుకే తీర ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Viral: సముద్ర తీరానికి వెళ్లిన మనిషి మిస్సింగ్.. ఉబ్బిన కడుపుతో కనిపించిన మొసలి.. దాన్ని పట్టి.. పొట్ట చీల్చగా

Viral: సముద్ర తీరానికి వెళ్లిన మనిషి మిస్సింగ్.. ఉబ్బిన కడుపుతో కనిపించిన మొసలి.. దాన్ని పట్టి.. పొట్ట చీల్చగా

Indonesia:ఇండోనేషియాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. వెస్ట్ పాపువా ప్రావిన్స్‌లోని తెలుక్ బింటునీకి చెందిన నిర్మాణ కార్మికుడు యెనిమాన్ బెర్నార్డ్ సముద్ర తీరంలో ఈత కొట్టిన అనంతరం.. పడవపై  కూర్చుని ఉండగా.. ఓ 13 అడుగుల మొసలి వచ్చి అతడిని నీటిలోకి లాగి అమాంతం మింగేసింది. జూన్ 28 న ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో అతడి ఆచూకి కోసం సముద్రంలో వెతికారు. కనిపించకపోయే సరికి మొసలే మింగేసి ఉంటుందని భావించారు. ఆగ్రహించిన స్థానికులు దాని కోసం సముద్రంలో వేట మొదలెట్టారు. జూన్ 29 సాయంత్రం ఉబ్బిన కడుపుతో భారీ మొసలి ఒకటి వారికి కనిపించింది. దీంతో అదే మనిషిని మింగేసి ఉంటుందని భావించిన వారు.. దాన్ని బంధించి.. ఒడ్డుకు తీసుకువచ్చారు. ఒక కత్తిని ఉపయోగించి దాని పొట్టను చీల్చగా.. వారు ఊహించిందే జరిగింది. లోపల దాదాపుగా జీర్ణం అయిన మానవ అవశేషాలు కనిపించాయి. మొసలి పొట్ట లోపల ఉన్న మనిషి బాడీ.. మిస్సైన వ్యక్తిదే అని స్థానిక పోలీసు అధికారి రెసిహోల్ లింబాంగ్ ధృవీకరించారు. అయితే అధికారికంగా కన్ఫామ్ చేయడానికి… మొసలి కడుపులో ఉన్న ఒక పుర్రె, కొన్ని ఎముకలను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.

Viral: సముద్ర తీరానికి వెళ్లిన మనిషి మిస్సింగ్.. ఉబ్బిన కడుపుతో కనిపించిన మొసలి.. దాన్ని పట్టి.. పొట్ట చీల్చగా
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad