Pani Puri: పానీ పూరీ ప్రియులకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. వర్షాల సీజన్‌లో తోపుడు బండ్లపై పానీ పూరీ తినొద్దని సూచించారు.
Pani Puri: తోపుడు బండ్లపై పానీ పూరీ తింటున్నారా? అయితే ఈ వార్నింగ్ మీకే..
భారీ వర్షాల నేపథ్యంలో ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఆహారం, నీరు కలుషితమైతే విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.
కోవిడ్ నుంచి పూర్తిగా బయటపడ్డా.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని అన్నారు. కరోనాతో ఇక భయపడాల్సిన అవసరంలేదని.. అయితే మాస్క్ మాత్రం కచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు. మాస్క్ పెట్టుకుంటే బ్యాక్టీరియా, వైరస్ కారక సీజనల్ వ్యాధులు, విష జ్వరాల బారి నుంచి తప్పించుకోవచ్చని అన్నారు.