Trending

6/trending/recent

SSC Examinations No Phone Zones : నో ఫోన్ జోన్లు'గా పరీక్షా కేంద్రాలు

  • నేటి నుంచి చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్లకూ అనుమతి లేదు
  • ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ చేయాలని నిర్ణయం
  • స్పెషల్ సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ

SSC Examinations No Phone Zones : నో ఫోన్ జోన్లు'గా   పరీక్షా కేంద్రాలు

పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల లీకేజీలు, మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ జరగకుండా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వరుసగానాలుగు పరీక్షల్లో వివిధ ప్రాంతాల్లో లీకులు జరిగాయి. కొన్ని ఘటనల్లో ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉండగా.. మిగిలిన అన్నింట్లో పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల నుంచి ఇతర ప్రభుత్వ సిబ్బంది సహకారమే ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండేళ్ల కరోనా కారణంగా పరీక్షలు రద్దుకాగా.. ఈ ఏడాది తొలిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మరోవైపు పరీక్షా కేంద్రాల సంఖ్య పెంపుతోపాటు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని లీకువీరులు విజృంభిస్తున్నారు. అయినప్పటికీ పరీక్ష ప్రారంభమైన వెంటనే ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి, వాట్సప్ పంపుతూ లీకే జీకి పాల్పడుతున్నారు. పరీక్షా కేంద్రంలో కేవలం చీప్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ సెల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతిలేదు. 

[post_ads]

అయినప్పటికీ కొందరు సిబ్బంది. తీసుకెళ్లడం వల్లే తొలి మూడు పరీక్షల్లో లీకేజీలు జరిగినట్లు గుర్తించారు. ఇక నాలు గోదైన మ్యాథ్స్ పరీక్షలో ఏకంగా రీఫ్ సూపరింటెండెంట్ సహా డిపార్టమెంట్ ఆఫీ సర్, ఇన్విజిలేటర్ల పాత్ర ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లోకి ఇప్పటి వరకు చీఫ్ సూపరింటెండెంట్లకు (సీఎస్) సెల్ ఫోన్లు తీసుకెళ్లే దుకు అనుమతి ఉండగా.. తాజాగా వారికి అనుమతిని తొలగిస్తూ పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం మ్యాథ్స్ పరీక్షకు సంబంధించి ఏలూరు జిల్లాలో సీఎస్ పాత్ర ఉందని నిర్ధారణ కావడంతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్ని నేరుగా రంగంలోకి దిగారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పరీక్షా కేంద్రాలను 'నోఫోన్ జోన్లు'గా చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇన్విజిలేటర్లు, డిపార్టమెంట్ ఆఫీసర్లు, చీస్ సూపరింటెండెంట్లు, ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది, ఎఎస్ఎం, పోలీస్ సిబ్బంది ఎవ రికికూడా మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడానికి వీలు లేదు. అలాగే స్మార్ట్ వాచ్లు, డిజిటల్ వార్లు, బ్లూ టూతో అనుసంధానమయ్యే ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణాలకూ అనుమతి లేకుండా ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రం ప్రాంగణంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించినా వెంటనే స్వాధీనంచేసుకోవాలని స్పష్టం చేశారు. జంబ్లింగ్తో ఎవరెక్కడో..

పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేషన్ విధులను ప్రకటించిన మేరకు కాకుండా జం లింగ్ చేయాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా సూచించిన కేంద్రాల్లో నైతే ప్రశ్నాపత్రాల లీకేజీలకు అవకాశం ఉంటుందినే ఉద్దేశంతో ఈ మేరకు జంబ్లింగ్ చేయాలని నిర్ణయించింది. జిల్లాల విద్యాశాఖాధికారులు మిగిలిన పరిక్షలకు ఇన్విజిలేటర్లను వేర్వేరు కేంద్రాలకు కేటాయించాలని విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే పరీక్షా పత్రాలు సీల్ చేయడం తదితరాలను డిపార్టమెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ల సనుక్షంలో, వారి సంతకాలతో కలిపి చీప్ సూపరింటెండెంట్ నిర్వ హించేలా సూచించారు. ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే విద్యార్థులు తమ రోల్ నెంబరు రాసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఫంగ్ స్క్వాడ్ల సంఖ్యను కూడా పెంచాలని, జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ, పోలీస్, ఇతర కాఖల అధికారులతో స్క్వాడ్ బృందాలను నియమించి తనిఖీలు చేసేలా చూడాలని విద్యాశాఖ కోరింది.

SSC Examinations No Phone Zones : నో ఫోన్ జోన్లు'గా   పరీక్షా కేంద్రాలు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad