APRS 5th Class Admissions 2022-23 Notification, Online Application AP Residential Schools 5th Class Admissions 2022-23 -Notification-Schedule-Fee Payment-Online Application Admissions into 5th Class / Class V in Andhra Pradesh Residential Schools for the Academic Year 2022-23
APRS 5th Class Admissions 2022-23 Notification, Online Application
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి అడ్మిషన్లు:
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థగుంటూరు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ పద్ధతి (లాటరీ పద్ధతి) ద్వారా విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ మరియు 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా, కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లాతో సహా) 2022-23 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ పద్ధతి (లాటరీ పద్ధతి ద్వారా తేది 10-06-2022 న ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు జరుగును.
ప్రవేశానికి అర్హత:
వయస్సు: ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
సంబంధిత జిల్లాలో 2020-21 & 2021-22 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి.
O.C మరియు B.C విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో మాత్రమే చదివి ఉండాలి. S.C, S.T. మరియు మైనారిటీ విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో చదివినప్పటికీ జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.
ఆదాయపరిమితి: అభ్యర్థి యొక్క తల్లి,తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ ద్వారాదరఖాస్తు రుసుము రూ.50/- లు చెల్లించి ప్రాధమిక వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చును.
దరఖాస్తు:- దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://aprs.apcfss.in. ను చూడగలరు.
గడువు: ఆన్ లైన్ ద్వారా ది. 09-05-2022 నుండి తేది. 31-05-2022 వరకు పైన తెలిపిన వెబ్ సైట్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చును.
APRS 5th Class Admissions 2022-23 Fee Payment click here
APRS 5th Class Admissions 2022-23 Online Application click here
APRS 5th Class Admissions 2022 Notification click here
[post_ads]