ఆసాని తుఫాన్.. మే 10 సాయంత్రానికి వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ & ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది.
AP Rain Alert: ఏపీ ప్రజలకు ‘అసాని’ అలర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు: ఐఎండీ
Asani Cyclone Updates: అసాని తుఫాను ఆగ్నేయ దిశగా బంగాళాఖాతం గత 06 గంటల్లో గంటకు 13 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. దీని కారణంగా ఏపీలో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవులు)కి పశ్చిమాన 400 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి ఆగ్నేయంగా 940 కి.మీ, పూరీ (ఒడిశా)కి ఆగ్నేయంగా 1000 కి.మీ. వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది వచ్చే 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంపై తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఇది మే 10 సాయంత్రానికి వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ & ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది ఈశాన్య దిశగా తిరిగి పునరావృతం చెంది ఒడిషా తీరానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిలంచింది. దీనికారణంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పొరుగు ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు ఐఎండీ తెలిపింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన..
ఉత్తర కోస్తా ఆంధ్ర – యానాం: ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దీంతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్ల వేగముతో గాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.