Vastu shastra: వాస్తు శాస్త్రం దిక్కులకు మాత్రమే కాదు.. వస్తువులకు సంబంధించింది కూడా మనందరికీ తెలిసిందే. అయితే, వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు అది కూడా ఇతరులు వాడినవి మీ వద్ద అస్సలు పెట్టుకోకూడదు. దీనివల్ల మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. అవేంటో తెలుసుకుందాం
Vastu tips: ఇతరుల ఈ 5 వస్తువులు మీ వద్ద ఉంటే దురదృష్టం మీకు తోడైనట్లే.. వెంటనే వదిలించుకోండి..
గడియారం సమయం గురించి మాత్రమే కాదు, మీ జీవితంలోని మంచి, చెడులను గురించి కూడా సూచిస్తుంది. అందుకే ఇతరుల వాచ్ లు కూడా ధరించకూడదు. ఉంటే ఎంత త్వరగా అయితే, అంత త్వరగా వదిలించుకోవడం బెట్టర్.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. దీని కారణంగా, ఆ వ్యక్తి ప్రతికూల శక్తి మీకు వస్తుంది. ఇది అనేక విధాలుగా మీకు హాని చేస్తుంది.ఇతరుల బట్టలు వేసుకోవడం కూడా ఆరోగ్యకరం కాదు. ఇతరుల బట్టలు వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల పెన్, పెన్సళ్లు వంటివి కూడా తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీ కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరిస్థితిపై హానికరమైన ప్రభావం ఉంటుంది
బూట్లు, చెప్పులు శని గ్రహానికి సంబంధించినవిగా నమ్ముతారు. ఇతరుల బూట్లు ,చెప్పులు ధరించడం వల్ల మీ జీవితంలో శని ప్రభావం పడుతుంది. కాబట్టి ఇతరుల బూట్లు ఉపయోగించవద్దు
ఆభరణాలను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇతరుల నగలు ధరించడానికి లేదా ఉపయోగించడాన్ని ఎవరూ కూడా అనుమతించకూడదు. లేకుంటే ఆ వ్యక్తుల ఆరోగ్యం, ఆర్థిక విషయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది