Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. ఆలయం వద్ద ఊహించని పరిణామం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు (Sri Venkateswara Swamy) కొలువైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల (Tirumala). సప్తగిరులపై నిత్యం గోవింద నామస్మరణ వినిపిస్తుంటుంది. ఏవైపు చూసినా ఆ శ్రీనివాసుడే దర్శనమిస్తాడు. 

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. ఆలయం వద్ద ఊహించని పరిణామం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ..

 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు (Sri Venkateswara Swamy) కొలువైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల (Tirumala). సప్తగిరులపై నిత్యం గోవింద నామస్మరణ వినిపిస్తుంటుంది. ఏవైపు చూసినా ఆ శ్రీనివాసుడే దర్శనమిస్తాడు. శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకే టీటీడీ (TTD) వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది.

నిత్యం స్వామివారికి జరిగే పూజలు, ఉత్సవాలు, ప్రత్యేక సేవలను ఎస్వీబీసీ ఛానల్ ద్వారా టీటీడీ ప్రసారం చేస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులను వీటిని తిలకించేందుకు ఆలయం పరిసరాల్లో పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. ఇందులో నిత్యం ఎస్వీబీసీ ఛానల్ ప్రసారమవుతుంటుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఆధ్యాత్మిక భావనను అడుగడునా ఉట్టిపడేలా చేసేదుకు ఎస్వీబిసి ఛానెల్ ప్రసారం చేసే ఎల్ఈడీ స్క్రీన్ లలో సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో అధ్యాత్మిక కార్యక్రమాలకు బదులుగా స్క్రీన్ పై ఒక్కసారిగా సినిమా పాటలు ప్రసారం‌ కావడాన్ని చూసిన భక్తులు షాక్ కు గురి అయ్యారు.

దాదాపు అరగంట పాటు సినిమా పాటలను ఎస్వీబీసీ సిబ్బంది ప్రసారం చేసారు.. ఓ వైపు టీటీడీ బ్రాడ్ క్యాస్టింగ్ లో గోవింద నామాలు వినపడుతుండగా, మరోవైపు స్క్రీన్ పై సినిమా పాటలు రావడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ఛానల్ లో సిబ్బంది నిర్లక్ష్యం పై భక్తులు కేకలు వేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే సెట్ అప్ బాక్స్ ఫెయిల్యూర్ కారణంగానే సినిమా పాట ప్రసారం అయ్యిందని, సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని, ప్రస్తుతం ఎస్వీబీసీ ఛానల్ యాధావిధిగా ప్రసారం అవుతుందని టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు.

ఈఘటనపై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏడుకొండలవాడి సన్నిదిలో సినిమా పాటలు వేసి భక్తులకు నరకం చూపుతున్నారని విమర్శించారు. ఈ ఘటనను కవర్ చేసేందుకు ఏ కథ చెబుతారోనని ఎద్దేవా చేశారు.



Below Post Ad


Tags

Post a Comment

0 Comments