The Most Painful Photo to See In Teaching Life : ఉపాధ్యాయులను ఇలా చూడడం చాలా బాధగా ఉంది..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

The Most Painful Photo to See In Teaching Life : ఉపాధ్యాయులను ఇలా చూడడం చాలా బాధగా ఉంది..

పై ఫోటో లోని వ్యక్తులు గజ దొంగలు కాదు.పిల్లలకు విద్యా బుద్దులు నేర్పవలసిన టీచర్లు.మరి వీరికి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది?

గత కొన్ని సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో వేళ్లూనికొని పోయిన అవినీతి మార్గం.ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కే పరిమితమైన 100% పాస్ మరియు ర్యాంక్ ల గోల మన ప్రభుత్వ స్కూళ్లకు కూడా పాకింది. ఇది ఎంతవరకు పాకిందంటే నా సబ్జెక్టు అని టీచర్,నా స్కూల్ అని హెచ్.ఎం ,నా మండలం అని MEO , నా డివిజన్ అని Dy.E.O , నా జిల్లా అని DEO ,నా రాష్ట్రం అని పాఠశాల విద్యా శాఖ మరియు ప్రభుత్వం ఏం చేసి ఐనా 100% సాధించెయ్యాలనే తపన.ఈ క్రమంలో అందరికీ సాధ్యం కాని 100% అందరూ సాధించెయ్యాలని టార్గెట్లు పెట్టడం.1% లేదా 2% తగ్గితే చివాట్లు పెట్టడం.ఈ భయంతో టీచర్లు అక్రమ మార్గాలలో పరీక్షలు నిర్వహించడం.

దీని వల్ల ఏం సాధించాం?విద్యార్థులు పాఠాలు వినడం మానేశారు,చదవడం మానేశారు,టీచర్లను గౌరవించడం మానేశారు.చదువన్నా,గురువన్నా భయం గాని భక్తి గాని లేకుండా ఐపోయారు.11 నెలలు ఎవడు కష్టపడమన్నాడు 11 రోజులు కష్టపడితే చాలు అనే స్థితికి మనం కూడా కారణం.కాబట్టి పాడైన వ్యవస్థను గాడిలో పెట్టవలసింది కూడా మనమే.ఇప్పుడిప్పుడే మార్పు మొదలయ్యింది

The Most Painful Photo to See In Teaching Life : ఉపాధ్యాయులను ఇలా చూడడం చాలా బాధగా ఉంది..

Below Post Ad


Post a Comment

0 Comments