Jobs in Andhra Pradesh: విశాఖపట్నంలో కాంట్రాక్టు జాబ్స్.. వేతనం నెలకు రూ. 18,500.. అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ విశాఖపట్నం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 25 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://visakhapatnam.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి ఏప్రిల్ 18, 2022 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
| పోస్టు | ఖాళీలు | వేతనం |
| ఆడియోమెట్రిషియన్ | 01 | రూ. 18,500 |
| రేడియోగ్రాఫర్లు | 01 | రూ. 21,500 |
| థియేటర్ అసిస్టెంట్ | 03 | రూ. 15,000 |
| పోస్టుమార్టం అసిస్టెంట్ | 03 | రూ. 15,000 |
| ల్యాబ్ టెక్నిషియన్ | 01 | రూ.28,000 |
| ల్యాబ్ అటెండెంట్లు | 06 | రూ.15,000 |
| కౌన్సెలర్లు | 01 | రూ. 21,500 |
| బయోమెడికల్ ఇంజినీర్లు | 02 | రూ.52,000 |
| జనరల్ డ్యూటీ అటెండెంట్లు | 01 | రూ.15,000 |
| ప్లంబర్ | 03 | రూ. 18,500 |
| ఎలక్ట్రిషియన్ | 02 | రూ. 18,500 |
| ఆడియోమెట్రిషియన్ | 01 | రూ. 18,500 |



