పిలల్లు సరిగ్గా భోజనం చేయాలంటే ఫోన్స్, వారు అల్లరి చేయకుండా ఉండాలంటే స్మార్ట్ ఫోన్స్.. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మొబైల్స్.. ఇలా ప్రతి ఒక్క పనికి నేటి కాలం పిల్లలు ఫోన్స్‌పైనే ఆధారపడుతున్నారు. భోజనం చేసే సమయంలోనూ ఫోన్ ముందు పెట్టుకుంటున్నారు. ఇలా చేస్తే ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. భోజనం చేసే సమయంలో పిల్లలను ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌కు దూరంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
Food Time Mobile Avoiding Tips for Children : పిల్లలు భోజనం చేసేప్పుడు ఫోన్ చూస్తున్నారా.. ఇలా చేస్తే వెంటనే మానేస్తారు..!
ఈ జనరేషన్లో తల్లిదండ్రులు ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్.. పిల్లల స్క్రీన్ టైమ్. పొద్దున్న నిద్రలేచినప్పటి నుంచి రాత్రి బెడ్ ఎక్కేవరకు పిల్లలు.. ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ చూస్తూనే ఉంటారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత.. ఆన్‌లైన్ క్లాస్‌ల కారణంగా స్క్రీన్ల ముందు గడిపే సమయం ఇంకా ఎక్కువైంది. అన్నం తినేప్పుడూ ఫోన్ ముందేసుకుని కూర్చుంటారు. అది ముందు లేకపోతే ఒక ముద్దకూడా ముట్టరు. దాన్ని లాక్కుంటే.. తినే అన్నం మానేస్తారు. ఇక వేరే ఆప్షన్ లేక తల్లిదండ్రులు ఏమీ అనరు. పిల్లలను అలా వదిలేయాలా..? లేదా ఫోన్ లాక్కుని భోజనం చేసేప్పుడు పిల్లలని విసిగించాలా వారికి అర్థం కాదు.
చాలా మంది పిల్లలు వారి ఎదురుగా ఫోన్ ఉంటేనే అన్నం ముద్దలు మింగుతారు. భోజనం ఎప్పుడూ శ్రద్ధగా, దాని ధ్యాస పెట్టి చేయాలి. ఫోన్, ట్యాబ్ చూస్తూ పరధ్యానంగా తింటే.. మీ చిన్నారి అతిగా తినేలా చేస్తుంది. స్క్రీన్ చూస్తూ అన్నం తినే అలవాటు చేస్తే.. వారు సొంతంగా తినడం నేర్చుకోరు. ఇది మంచి అలవాటు కాదు. మీ పిల్లలు ఎక్కువ సేపు స్ర్కీన్ చూస్తే మానసికంగా, శారీరకంగా వారిపై చెడు ప్రభావం ఉంటుంది. మీ పిల్లలు భోజనం చేసేప్పుడు వారిని స్క్రీన్‌కు దూరం పెట్టాలనుకుంటున్నారా.. ! అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..