Trending

6/trending/recent

COVID-19 : కోవిడ్ బారిన పడిన విద్యార్థులు.. తాత్కాలికంగా మూతబడ్డ రెండు పాఠశాలలు

నోయిడాలో, ఘజియాబాద్‌‌లో రెండు పాఠశాలలు మూతబడ్డాయి. ఆ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు కోవిడ్ బారిన పడ్డారు. దాంతో స్కూల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థులతో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించాయి.

COVID-19 : కోవిడ్ బారిన పడిన విద్యార్థులు.. తాత్కాలికంగా మూతబడ్డ రెండు పాఠశాలలు

కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్‌ పెట్టుకోవాలనే నిబంధనను కూడా ఎత్తివేశారు. అయితే మళ్లీ కోవిడ్ వైరస్ పంజా విసురుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో రెండు పాఠశాలలో విద్యార్థులు కోవిడ్ బారిన పడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టార్ 40లో ఉన్న ఒక పాఠశాలను కొన్ని రోజులపాటు క్లోజ్ చేశారు. పాఠశాలలో 13 మంది విద్యార్థులకు, ముగ్గురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో స్కూలు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత ఆ పాఠశాలలో విద్యార్థులు, సిబ్బందికి కోవిడ్ సోకినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్కూల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆరు, తొమ్మిదో తరగతులకు చెందిన విద్యార్థులు కోవిడ్‌తో పాజిటివ్‌గా తేలింది.

స్కూల్ నిర్వాహకులు వెంటనే ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ మేరకు వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా మెలిగేవారు కూడా జాగ్రత్తగా ఉండమని సూచించారు. అయితే పాఠశాలలో కోవిడ్ కేసులు బయటపడడంతో చాలామంది భయాందోళనకు గురయ్యారు. కోవిడ్ కేసులు నమోదైన మొదటి పాఠశాల కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

అలాగే ఇద్దరు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఘజియాబాద్‌లోని ఒక పాఠశాలను తాత్కాలికంగా క్లోజ్ చేశారు. ఇందిరాపురంలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడో తరగతి చదువుతున్న విద్యార్థికి, 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థికి ఇన్‌ఫెక్షన్‌ సోకిందని తేలింది. దీంతో పాఠశాలలో ఆఫ్‌లైన్ తరగతులు ఏప్రిల్ 13వ తేదీ వరకు నిలిపివేశారు. అలాగే తల్లిదండ్రులు, విద్యార్థులు కోవిడ్ జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.
COVID-19 : కోవిడ్ బారిన పడిన విద్యార్థులు.. తాత్కాలికంగా మూతబడ్డ రెండు పాఠశాలలు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad