Chanakya Niti: ఈ తప్పులు చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఖతమే.. చాణుక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 అబద్ధాలు - ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. అబద్ధాలు ఏవైనా సంబంధాన్ని బలహీనపరుస్తాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అది బంధానికి హాని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య నిజాయితీ ఉండటం చాలా ముఖ్యం. ఇద్దరి బంధం సత్యం, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

Chanakya Niti: ఈ తప్పులు చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఖతమే.. చాణుక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి.. 

కోపం - కోపం ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. కోపం తెచ్చుకోవడం అనేది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. కోపంగా ఉన్న వ్యక్తి తాను చేస్తున్న పనిని మరచిపోతాడు. కోపంతో మాట్లాడే విషయాలు చాలా మనస్పర్థలను కలిగిస్తాయి. కాబట్టి భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. 

అవమానం - భార్యాభర్తల మధ్య సంబంధాలు గౌరవప్రదంగా ఉండాలి. ఎవరైనా ఎవరినైనా అవమానిస్తే అది బంధానికి చాలా హానికలిగిస్తుంది. కాబట్టి భార్యాభర్తలు పరస్పరం దూషించుకోవడం మానుకోవాలి.

గోప్యత - భార్యాభర్తల మధ్య గోప్యత ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. భార్యాభర్తల వ్యక్తిగత విషయాలు మూడో వ్యక్తికి తెలియజేయడం సంబంధానికి అస్సలు మంచిది కాదు. అదే సమయంలో సంబంధాన్ని కొనసాగించడానికి అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ లోపం భార్యాభర్తల మధ్య సంబంధాన్ని నాశనం చేస్తుంది.

ఇలాంటి విషయాల్లో తప్పులు చేస్తే భార్యభర్తల మధ్య సంబంధం ఎక్కువ కాలం ఉండదని చాణక్య పేర్కొన్నారు.

Chanakya Niti: ఈ తప్పులు చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఖతమే.. చాణుక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి..


Below Post Ad


Post a Comment

0 Comments