AP Weather Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యూస్.. వాతావరణంలో భారీ మార్పు.. మరో మూడు రోజులపాటు..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు.

AP Weather Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యూస్.. వాతావరణంలో భారీ మార్పు.. మరో మూడు రోజులపాటు..

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర వాతావరణ నివేదికను విడుదల చేశారు ఐఎండీ అధికారులు. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో ఇవాళ వాతావరణం పొడిగా అవకాశం ఉంది. రేపు అంటే సోమవారం నాడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇ ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాయలసీమ జిల్లాల్లో ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5డిగ్రీల సెంటీగ్రేడ్ సాధారణముకంటె ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదుకావచ్చన్నారు. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీయ వచ్చును. రేపు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 5డిగ్రీల సెంటీగ్రేడ్ సాధారణముకంటె ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదుకావచ్చును.. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.  గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 5డిగ్రీల సెంటీగ్రేడ్ సాధారణముకంటె ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదుకావచ్చన్నారు.

దక్షిణ కోస్తా ఆంధ్ర:

ఈరోజు రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4డిగ్రీల సెంటీగ్రేడ్ సాధారణముకంటె ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదుకావచ్చు.

రాయలసీమ..

ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. అలాగే రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు.

Below Post Ad


Tags

Post a Comment

0 Comments