AP Inter 1st Year English Model Paper | కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పరీక్షలను నిర్వహించాల్సిన షెడ్యూల్ ను వాయిదా వేయడమో, సిలబస్ తగ్గించడమో చేయాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రభుత్వం గత ఏడాది ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను వాయిదా వేస్తూ వచ్చింది.
AP Inter 1st Year English Model Paper: ఏపీ ఇంటర్ ప్రత్యేకం.. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ డౌన్‌లోడ్
మొదటి నాలుగు sections రాసేయవచ్చు. మొత్తం 32 మార్కులు ఈజీగా సాధించవచ్చు. prose నుండి రెండు లెసన్స్, poetry నుండి రెండు లెసన్స్ చదివితే.. మొత్తంగా 32 మార్కులకు సమాధానాలు రాసేయవచ్చు. ఇక 5వ సెక్షన్ లో నాన్ డిటైల్డ్ (NON DETAILED) అయిన ఐదు చాప్టర్ల నుండి The immaculate Child, The Informer-one act play అనే రెండు చాప్టర్లను తొలగించారు. దీంతో ప్రస్తుతం నాన్ డిటైల్డ్ లో మూడు చాప్టర్లు మాత్రమే మిగిలాయి. అంటే గతంలో ఐదు చాప్టర్ల నుండి వచ్చే మూడు ఎస్సై ప్రశ్నలు.. ఇప్పుడు కేవలం 3 చాప్టర్ల నుండి వస్తాయి. అంటే ప్రతీ చాప్టర్ నుండి ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. దీనినిబట్టి.. ఏ ఒక్క చాప్టర్ ను బాగా చదివి గుర్తుపెట్టుకుంటే.. నాన్ డిటైల్డ్ నుండి వచ్చే ఒక 8 మార్కుల ప్రశ్నను సులభంగా రాసేయవచ్చు.
SECTION-C నుండి గ్రామర్ పార్ట్ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో బేసిక్ గ్రామర్ ప్రశ్నలు వస్తాయి. టెస్ట్ బుక్ లో ప్రస్తుతం ఉన్న సిలబస్ నుండి ఇచ్చిన గ్రామర్ ను కొద్దిగా వీటిని ముందే ప్రాక్టీస్ చేయగలిగితే.. SECTION-Cలో మంచి మార్కులు సాధించవచ్చు. మొత్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ మంచి మార్కులతో పాసయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.