AP 10th Exams Paper Leak: 3 రోజులుగా లీకౌతున్న టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్లు! ?

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 ఏపీలో టెన్త్‌ ఎగ్జామ్‌ క్వశ్చన్‌ పేపర్ల లీకుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మొన్న తెలుగు, నిన్న హిందీ పేపర్స్‌ లీకైన ఘటనలు మరువకముందే.. ఇవాళ నంద్యాల నందికొట్కూరులో ఇంగ్లీప్‌ పేపర్‌ లీకవడం..

AP 10th Exams Paper Leak: 3 రోజులుగా లీకౌతున్న టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్లు! 

Tenth Class English question paper leaked in Andhra Pradesh: ఏపీలో టెన్త్‌ ఎగ్జామ్‌ క్వశ్చన్‌ పేపర్ల లీకుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మొన్న తెలుగు, నిన్న హిందీ పేపర్స్‌ లీకైన ఘటనలు మరువకముందే.. ఇవాళ నంద్యాల నందికొట్కూరులో ఇంగ్లీప్‌ పేపర్‌ లీకవడం సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఏప్రిల్‌ 29న ఇంగ్లిష్‌ పరీక్ష జరుగుతోంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే (ఉదయం 10 గంటలకు) ప్రశ్నపత్రం సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. పరీక్ష పేపర్‌ లీకేజ్‌ నేపథ్యంలో జిల్లా విద్యాధికారి ఎగ్జామ్‌ సెంటర్‌ను పరిశీలించి, ఈ వ్యవహారంపై ఆరా తీశారు. మరోవైపు విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలో టెన్త్ పరీక్షల నిర్వహణలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ జిల్లాలో ఏకంగా పరీక్ష కేంద్రాన్నే మార్చేశారు. సెంటర్‌ కోడ్‌ ఒక చోట ఉంటే.. పరీక్షల నిర్వహణ మరో చోట జరుగుతోంది. విజయం స్కూల్స్‌ యాజమన్యం నిర్వాకాన్ని విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల జోక్యం లేనిదే, కేటాయించిన ఎగ్జాం సెంటర్‌లో కాకుండా.. మరోచోట పరీక్ష నిర్వహిచడం అసాధ్యమని పలువురు విమర్శిస్తున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలో మరో ఘటన జరిగింది. ఓ టీచర్‌ ఏకంగా మాల్‌ ప్రాక్టీస్‌కు యత్నించాడు. క్వశ్చన్‌ పేపర్‌ను ఫొటో తీసేందుకు ప్రయత్నించిన టీచర్‌ పవన్‌కుమార్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఒకవైపు టెన్త్ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతుండగా, మరోవైపు డిగ్రీ తరగతులకు విద్యార్ధులు అటెండ్ అవుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. గత 15 ఏళ్లుగా ఇదే జరుగుతుందని, ఇదంతా విద్యార్థుల సౌకర్యం కోసమేనని, ఈ విషయంలో తప్పు లేదని డీఈఓ శ్రీరామ్ పురుషోత్తం సమర్ధించుకుంటున్నారు. విద్యాశాఖ వింత వైఖరిని స్థానికులు తప్పుపడుతున్నారు.

వరుసగా మూడో రోజు పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. స్థానిక అధికారులు మాత్రం తమ వద్ద లీక్‌ కాలేదంటూ వివరణలు ఇచ్చుకుంటున్నారు. ఈ వరుస లీకుల వ్యవహారం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబు, నారాయణ విద్యా సంస్థలు కుట్రలకు పాల్పడుతున్నారంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యా్‌ఖ్యానించారు. పేపర్ల లీకుల వెనక ఉన్నది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇంకా ఈ విధంగా మాట్లాడారు..

రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా పదో తరగతి పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్ కాలేదు. కుట్రలు, కుతంత్రాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కుట్రలన్నింటినీ మేము భగ్నం చేశాం. ఇప్పటికే ఆరుగురు టీచర్లపై విచారణ ప్రారంభమైంది. కొందరిని అరెస్టు చేశాం కూడా.. నంద్యాలలో పేపర్ లీక్ అయ్యిందనే వార్త పూర్తిగా అసంబద్ధం. సత్యసాయి జిల్లాలో 12 గంటల15 నిముషాలకు పేపర్ ఇమేజ్ బయటకు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.10 గంటలకే సోషల్‌ మీడియాలో పేపర్ బయటకు వచ్చిందనే వార్తలపై, విచారణ జరిపి, వాస్తవాలను తెలుసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కొందరు స్వార్థం కోసం కుట్ర పూరితంగా ఇలాంటివి స్ప్రెడ్‌ చేస్తున్నారు.
AP 10th Exams Paper Leak: 3 రోజులుగా లీకౌతున్న టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్లు!

Below Post Ad


Post a Comment

0 Comments