Women's Day Special Casual Leave to All Women Employees on March 8th on the occassion of International Women's Day
Women's Day Special Casual Leave
న్యూస్ టోన్, ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీ.ఓ ఎం.ఎస్ నంబర్ 433 ప్రకారం రాష్ట్రం లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ మార్చ్ 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రత్యేక ఆకస్మిక సెలవు ఉంటుంది. ఉత్తర్వులలో పేర్కొన పోయినప్పటికీ మహిళా ఉద్యోగులందరూ వారి సాధికారత పై, సమస్యల పై సభలు, విశేష కృషి చేసిన వారికీ సన్మానాలు వంటి కార్యక్రమాల హాజరు కు ఈ సెలవు ఉద్దేశించినది. అందువలన సంబంధిత అధికారులు ఈ రోజు సెలవును వినియోగించుకొనుటకు మహిళా ఉద్యోగులు హాజరైన చోటు నుండి హాజరు ధ్రువ పత్రాన్నీ తదుపరి రోజు సమర్పించవలసిందిగా ఆదేశిస్తూ ఉంటారు. కొన్ని జిల్లాల్లో ఈ విషయంపై స్పష్టమైన అధికారిక ఉత్తర్వులు కూడా ఉన్నాయి. కావున ఈ సెలవు వినియోగించుకోవాలనుకునే మహిళా ఉద్యోగులు తప్పక హాజరు ధ్రువ పత్రాన్ని పొందండి. క్రింద క్లిక్ చేసి ఉత్తర్వుల కాపీలను, Leave Application డౌన్లోడ్ చేసుకోండి.