SBI Customers alert : భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఖాతాదారులకు ఎలాంటి అవాంతరాలు లేని బ్యాంకింగ్ సేవలను పొందేందుకు తమ శాశ్వత ఖాతా నంబర్ (పాన్)ని ఆధార్ కార్డ్‌తో మార్చి 31 గడువులోగా లింక్ చేయాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌బిఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా కూడా కస్టమర్లను అలర్ట్ చేసింది. ‘‘ఏ విధమైన అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు. అవాంతరాలు లేని బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించడానికి కస్టమర్లు వారి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి.’’ అని సూచించింది.
SBI Customers alert
పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN) ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పది అంకెల విశిష్ట ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఆర్థికపరమైన లావాదేవీలకు ఈ పాన్ నెంబర్ కీలకం. అన్ని లావాదేవీలు దీని ఆధారంగానే జరుగుతాయి. అయితే, ప్రతీ లావాదేవీలకు సంబంధించి వివరాలు పక్కాగా ఉండాలని, ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం.. పాన్, ఆధార్ కార్డుల అనుసంధానం చేయాలని ప్రజలకు సూచించింది. ఇందుకోసం గడువు కూడా విధించింది. గతంలోనే అనేక పర్యాయాలు పాన్-ఆధార్ లింకింగ్ డేట్‌ను పొడగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మార్చి 31, 2022 చివరి తేదీగా కేంద్రం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఎస్‌బిఐ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. ఒకవేళ గడువు తేదీలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ట్రాన్సాక్షన్స్ చేయడంలో అవాంతరాలు ఏర్పడుతాయి. ఇదే విషయాన్ని వివరిస్తూ ఎస్‌బిఐ ట్వీట్ చేసింది.
మీ పాన్ కార్డ్‌ని – ఆధార్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో ఎలా లింక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
1. కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ 2.0 (https://www.incometax.gov.in/iec/foportal) కి వెళ్లండి.
2. ‘లింక్ ఆధార్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. అక్కడ అడిగిన వివరాలను నమోదు చేయండి. పాన్ నెంబర్, ఆధార్ నంబర్, ఆధార్ ప్రకారం పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి.
5. ఇప్పుడు (I have only year of birth in Aadhaar card, I agree to validate my Aadhaar details) బాక్స్‌లను టిక్ చేయాలి.
6. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఓటీపీ వస్తుంది.
7. ధృవీకరణ పేజీలో ఈ ఓటీపీని నమోదు చేసి ‘కన్‌ఫామ్’ చేయాలి.
8. ఆ తరువాత పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలనే మీ అభ్యర్థన సమర్పించబడిందని పేర్కొంటూ మీకు పాప్-అప్ సందేశం వస్తుంది.
We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/Qp9ZBqG4Xh
— State Bank of India (@TheOfficialSBI) February 18, 2022