Student Safety Conduct Special Sessions : విద్యార్థుల భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక సెషన్స్ నిర్వహించాలని ఆదేశాలు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

న్యూస్ టోన్, ఇబ్రహీంపట్నం : విద్యార్థుల భద్రతా ప్రమాణాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్ సురేష్ కుమార్ ఆదేశించారు. 

ఇటీవల మహిళా కమిషన్ చైర్పర్సన్ విద్యా శాఖ డైరెక్టర్ కు పిల్లల భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించవలసిందిగా కోరుతూ లేఖ రాశారు. విద్యార్థుల భద్రతా ప్రమాణాలపై ఇప్పటికే జనవరి 7వ తేదీన మరియు 28వ తేదీన ఉపాధ్యాయులకు ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ సేఫ్టీ కి సంబంధించిన అంశాలను విపులంగా చర్చించారు. కావున దీనికి అనుబంధంగా ఈ క్రింది అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉంది సురేష్ కుమార్ ఆదేశించారు.

  • మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ
  • సెక్సువల్ హరాస్మెంట్ 
  • హౌస్ హోల్డ్ హరాస్మెంట్ 
  • సైకాలజీ కౌన్సిలింగ్ 
  • ట్రాఫికింగ్ ఆఫ్ చిల్డ్రన్ ( పిల్లల అక్రమ రవాణా)
కావున అన్ని పాఠశాలల్లో ఈ అంశాలపై ప్రత్యేక తరగతులను నిర్వహించాల్సి ఉంటుంది.



Below Post Ad


Post a Comment

0 Comments