Limiting the Duties of MEO's : ఎం.ఈ.ఓ లకు పని భారం తగ్గిస్తూ ఆదేశాలు జారీ
Limiting the Duties of MEO's
న్యూస్ టోన్ అమరావతి : ఫిబ్రవరి 3వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో ఆదేశించిన విధంగా మండల విద్యాశాఖ అధికారులకు పని భారం తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని విద్యారంగంలో లో సమూల మార్పులు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాడు నేడు పథకం లో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తుంది, విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది, నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి శరవేగంగా అడుగులు వేస్తోంది మరియు అనేక పాఠ్య కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు పాఠశాలలో అమలు చేస్తుంది. వీటి అన్నిటి అమలుకు క్షేత్రస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది.
Limiting the Duties of MEO's
ప్రస్తుతం ఏకీకృత సర్వీసు నిబంధనలు అంశం కోర్టులో పెండింగ్లో ఉండటం వలన ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి మరియు ఉప విద్యాశాఖ అధికారి పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కావడం లేదు. రాష్ట్రంలో 264 మండల విద్యాశాఖ అధికారి పోస్టులు 50 ఉప విద్యాశాఖ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివలన ఒక్కో మండల విద్యాశాఖ అధికారి మూడు లేదా నాలుగు మండలాలను పర్యవేక్షించాల్సి వస్తుంది. వీటితో పాటు అదనంగా జిల్లా కలెక్టర్ వారు సూచించిన విద్య కు సంబంధం లేనటువంటి ఇతర కార్యక్రమాలను సైతం చేయాల్సి ఉంటుంది. దీనివలన పాఠశాలలపై పర్యవేక్షణ లోపించడంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా చేయలేని పరిస్థితి ఉంది.
దీనిని నివారించడానికి మండల విద్యాశాఖ అధికారులకు విద్య కు సంబంధం లేనటువంటి ఏ విధమైన ఇతర బాధ్యతలు అప్ప చెప్పవద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఇకపై మండల విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో పాఠశాలలపై, విద్యా కార్యక్రమాలపై పర్యవేక్షణ చేయడానికి అవకాశం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వుల కాపీ డౌన్లోడ్ చేసుకోండి
[post_ads]