DDO Powers to Model School Principals : మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు డి.డి.ఓ పవర్స్ ఇవ్వడానికి ప్రభుత్వం పచ్చజెండా

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

DDO Powers to Model School Principals : మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు డి.డి.ఓ పవర్స్ ఇవ్వడానికి ప్రభుత్వం పచ్చజెండా

DDO Powers to Model School Principals

న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్ల కు డి డి ఓ అధికారాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

మోడల్ స్కూల్ లకు సంబంధించి అనేక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆలస్యం అవుతున్న కారణంగా వీటికి కేటాయించిన నిధులు సరైన సమయంలో వినియోగించ పోవడం వలన ఆ నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. 

దీన్ని నివారించడానికి మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు ఎప్పటినుండో తమకు డి.డి.వో అధికారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరికి డి డి వో అధికారాలను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గా పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ను ప్రభుత్వం ఆదేశించింది. 

కావున అతి త్వరలో 164 మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్ళ కు డి డి వో అధికారాలను ఇస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుతం మోడల్ స్కూల్స్ కు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ని అసిస్టెంట్ డైరెక్టర్-1 డి డి ఓ గా వ్యవహరిస్తున్నారు.
DDO Powers to Model School Principals : మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు డి.డి.ఓ పవర్స్ ఇవ్వడానికి ప్రభుత్వం పచ్చజెండా

Below Post Ad

Post a Comment

0 Comments