WhatsApp New Features : వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఆ ఫోన్లకు సరికొత్త ఫీచర్‌.. అదేంటంటే?

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

WhatsApp New Features : వాట్సాప్(WhatsApp) తన వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంటుంది. 

WhatsApp New Features

నవంబర్ 2021 నుంచి 2022 వరకు ఎన్నో కీలక ఫీచర్లను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఓ ఫీచర్‌పై WhatsApp పని చేస్తోంది. ఇది ఒక విధంగా WhatsAppలో కనిపించిన అతిపెద్ద లోపంగా ఉండేది. 

కానీ, ఇప్పుడు దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరలో ప్రజలు ఈ అద్భుతమైన ఫీచర్‌ను పొందగలరు. ఈ మేరకు Meta ఈ ఫీచర్‌పై పనిచేస్తుందని తెలుస్తోంది.

చాట్ బ్యాకప్ ఇకపై ఈజీగా.. నివేదికల ప్రకారం, మెటా యాజమాన్యంలోని WhatsApp ఆండ్రాయిడ్ నుంచి iOSకి అనగా iPhoneకి చాట్‌లను బదిలీ చేసేందుకు ఓ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. 

కొద్ది రోజుల క్రితం, iOS నుంచి Samsung, Pixel ఫోన్‌లకు చాట్ బ్యాకప్‌ను బదిలీ చేసే ఫీచర్‌ను కంపెనీ విడుదల చేసింది. త్వరలో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కి కూడా ప్రారంభించనుందని వాట్సాప్ సీఈవో విల్ క్యాత్‌కార్ట్ తెలిపారు.

బీటా వెర్షన్‌పై మొదైలన టెస్టింగ్.. ప్రస్తుతానికి మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ని మార్చడం ద్వారా ఐఫోన్ (iPhone)కి మారి, WhatsAppకి లాగిన్ చేస్తే, మీకు చాట్ బ్యాకప్ లభించదు. 

నివేదికల ప్రకారం, ఈ ఫీచర్‌ను పరీక్షించడానికి బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ 2.21.20.11 విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకునే ఆప్షన్ కనిపించింది. టెస్టింగ్ విజయవంతం అయిన తర్వాత, త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

WhatsApp New Features : వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఆ ఫోన్లకు సరికొత్త ఫీచర్‌.. అదేంటంటే?

Below Post Ad


Post a Comment

0 Comments