Que Profession : కాదేదీ కవితకు అనర్హం అంటారు కవులు... అదే విధంగా మనసు ఉండాలే కానీ, డబ్బు సంపాదనకు చాలా మార్గాలు ఉన్నాయి అని నిరూపించాడు ఫ్రెడ్డీ అనే లండన్ వ్యక్తి.
ఏమి చేసి డబ్బులు సంపాదిస్తున్నాడో చూడండి. - Que Profession
అదేంటీ ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అనుకుంటున్నారా..? ఇది నిజం.. ఇప్పుడు ఈ అసలు విషయాన్ని మీరు తెలుసుకోండి..
కరోనా వచ్చినప్పటి నుంచి షాపింగ్ కాంప్లెక్సులు, అన్ని చోట్ల భౌతిక దూరం లాంటి నియమాలను పాటించాల్సి వస్తోంది. దీనికారణంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ వంటి వాటి దగ్గర పెద్ద పెద్ద క్యూలైన్లు ఏర్పడుతున్నాయి.
దీనికారణంగా గంటల తరబడి ఏం నిల్చుంటాంలే.. అనుకునే కొంతమంది షాపింగ్ చేయకుండానే వెనుదిరుగుతున్నారు. అలాంటి వారికోసం.. బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్ (31) అనే వ్యక్తి ఆలోచించాడు.
ఉదయాన్ని షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్ వద్దకు చేరి ఇలా గంటల తరబడి క్యూలో నిల్చుంటాడు. ఎవరికోసం అనుకుంటున్నారు.. ధనవంతుల కోసం.. ఇలా క్యూలో నిల్చొని వారికి కావాల్సింది కొనుగోలు చేసి ఇస్తాడు. ఇలా అతను కొనుగులు చేసి వారికి ఇచ్చినందుకు.. ధనవంతులు ఫ్రెడ్డీకి డబ్బులు ఇస్తుంటారు.
ప్రస్తుతం ఫ్రెడ్డీ ఇలా గంటల కొద్దీ లైన్లలో నిలబడి రోజుకు సగటున (£160) 160 యూరోలు, గంటకు (£20) యూరోలు సంపాదిస్తాడు. అదే మన కరెన్సీలో రోజుకు రూ. 16 వేలు సంపాదిస్తున్నాడు.
అయితే.. తాను మూడేళ్లుగా ఇదే ఉద్యోగం చేస్తున్నానని.. తాను ప్రొఫేషనల్ క్యూవర్‌ను అంటూ ఫ్రెడ్డీ బెకిట్ పేర్కొంటున్నాడు. తనకు ఇలా చేయడం బాగా ఉందని.. అవసరమైన వాళ్లు తన సేవలను వినియోగించుకుంటున్నారని వెల్లడిస్తున్నాడు.