Motivational Speaker Suicide : ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మోటివేషనల్ స్పీకర్ ఆత్మహత్య..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Motivational Speaker Suicide : ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మోటివేషనల్ స్పీకర్ ఆత్మహత్య.. ఎందుకంటే

Motivational Speaker Suicide

అతడు మోటివేషనల్ స్పీకర్ ( Motivational speaker ). కష్టాల్లో కూరుకుపోయిన మనషులకు స్ఫూర్తినిచ్చే విధంగా ప్రసంగాలు చేస్తారు. జీవితంలో సమస్యలతో విసిగివేసారిపోయిన వ్యక్తులకు తన మాటలతో నూతన ఉత్సాహం కలిగిస్తారు. 

చదువులో వెనకబడిపోయిన విద్యార్థులకు భవిష్యత్ పై ఆశల కలిగిస్తారు. ఆంగ్ల భాషను నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి సరమళమైన రీతిలో అర్థమయ్యేలా చెప్తారు. వ్యక్తిగతంగా ఎలా ముందుకు వెళ్లాలి.. మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలి.. ఉద్యోగం సంపాదించడానికి ఎలాంటి శిక్షణ కావాలి అన్న అంశాలపై అవగాహన కల్పిస్తారు. 

ఇలా అతడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాడు. చాలామందికి స్ఫూర్తినిచ్చిన అతడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు(personality development expert) కాసాల జైపాల్ రెడ్డి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. 

అందుతోన్న సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం తన నివాసం నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ఆయన అందులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి చనిపోయాడు. 

Motivational Speaker Suicide

జైపాల్ రెడ్డి స్వగ్రామం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామం. జైపాల్‌రెడ్డి మృతితో కుటుంబ సభ్యుల గుండెలవిసేలా రోదిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా జైపాల్ రెడ్డి అనేక మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. సుమారుగా ఎనిమిది వేల సదస్సులు నిర్వహించినట్లు స్థానికులు  చెబుతున్నారు. 

సోషల్ మీడియా, యూట్యూబ్ లను వేదికగా చేసుకొని అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టారు. తన రచనల ద్వారా అవగాహన కల్పించారు.

Motivational Speaker Suicide : ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మోటివేషనల్ స్పీకర్ ఆత్మహత్య..

Below Post Ad


Post a Comment

0 Comments