KFD Monkey Fever మంకీ ఫీవర్‌తో బాధపడుతూ ఓ మహిళ ఆస్పత్రి చేరడం కలకలం సృష్టిస్తోంది.
KFD Monkey Fever
కర్ణాటకలోని షిమోగా గ్రామానికి చెందిన 57 ఏళ్ల మహిళకు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ సోకింది. దీన్నే మంకీ ఫీవర్ అంటారు. వైద్యుల పరీక్షలో ఈ వ్యాధి నిర్ధారణ అయ్యింది. షిమోగా గ్రామానికి చెందిన మహిళ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో శి
కోతుల జ్వరంతో ఆసుపత్రి పాలైన షిమోగా మహిళ శివమొగ్గలోని ప్రభుత్వాస్పత్రిలో చేరింది. రక్త నమూనాలు సేకరించి పరీక్షించిన వైద్యులు.. ఆమెకు కేఎఫ్‌డీ నిర్ధారించారు. ఇదే విషయాన్ని శివమొగ్గ హెల్త్ ఆఫీసర్ రాజేష్ సురగిహళ్లి వెల్లడించారు. ఈ కేఎఫ్‌డీని మంకీ ఫీవర్ అని కూడా అంటారు.
ఇది క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ వల్ల వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ వైరస్, ప్రధానంగా కీటకాల ద్వారా వస్తుందని, కోతులు, మనుషులపై ప్రభావం చూపుతుందని వైద్యాధికారులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి 12 రోజుల వరకు తీవ్ర చలి జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాధి సోకిన వారిలో 3 నుంచి 5 శాతం మరణాల రేటు ఉంటుందన్నారు.
మంకీ ఫీవర్ అంటే ఏంటి?..
KFD ని మంకీ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఇది టిక్-బర్న్ వైరల్ హెమరేజిక్ వ్యాధి. ఇది మానవులకు, కోతులకు ప్రాణాంతకం. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ (ఫ్లావివిరిడే, ఫ్లావివైరస్ జాతికి చెందినది) ‘పేను’ జాతికి చెందినది. ఈ వ్యాధి పేను జాతుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా హేమోఫిసాలిస్ స్పినిగెరా(నల్లులు, గోమార్లు) ప్రధాన వ్యాప్తి కారణంగా పరిగణించబడుతుంది.
అయితే.. చిన్న చిన్న ఎలుకలు, కోతులు, పక్షులు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ (KFDV) వ్యాప్తిలో భాగం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పేళ్లు, నల్లులు, గోమార్లు(బగ్స్) పశువుల ద్వారా ప్రయాణించి.. కేడీఎఫ్ వ్యాధిని మనుషులకు సోకేందుకు కారణం అవుతాయి. వైరస్ సోకిన బగ్ జంతువును గానీ, మనిషిని గానీ కరిచినప్పుడు ఆ వ్యాధి సంక్రమిసతుంది.
అయితే, మనుషులే ఈ వ్యాధికి డెడ్ ఎండ్ హోస్ట్‌లుగా పేర్కొంటున్నా నిపుణులు. ఎందుకంటే మనుషుల నుంచి ఇతరులకు ఆ వైరస్ సోకదట. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని అణిచివేసేందుకు, కేఎఫ్‌డీవీకి వ్యతిరేకంగా న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఎవరు ప్రభావితమయ్యారు?
KFD మొదటిసారిగా 1957లో భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని క్యాసనూర్ ఫారెస్ట్‌లో బయటపడింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాప్తి చెంది. 2012 నుంచి ప్రతి సంవత్సరం 500 లకు పైగా మంకీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి.
KFD ద్వారా ప్రభావితమైన వారిలో 5 నుంచి 10% మంది బాధితులు రక్తస్రావ లక్షణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో ఈ వ్యాధి కారణంగా కనీసం 340 మంది ప్రాణాలు కోల్పోయారు.
క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ద్వారా ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో పని చేసే వారు ప్రభావితమవుతున్నారు. ఏడాది పొడవునా జంతువులను మేపే వారు, రైతులు, అటవీ సంపద కోసం అడవుల్లో కూలీ పనులు చేసే వారు, తోటలలో పనులకు వెళ్లే వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
Karnataka | A 57-year-old woman in Kudige village of Thirthahalli admitted to hospital with Kyasanur Forest Disease (KFD). Patient was suffering from fever for a few days, following which her blood sample was collected & tested for KFD:Shivamogga Health Officer Rajesh Suragihalli pic.twitter.com/JKEAQzqQQn
— ANI (@ANI) January 22, 2022