Trending

6/trending/recent

AP Corona Holidays : ఏపీలో పాఠశాలలకు సెలవులు పొడిగింపు.పై నేడు నిర్ణయం ?!

AP Corona Holidays :  ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పాఠశాలలకు సెలవులు పొడిగించే విషయంపై రాష్ట్ర విద్యాశాఖ పునరాలోచనలో పడింది. 

పబ్లిక్ ఒపీనియన్ ఆధారంగా సెలవుల అంశంపై ఇవాళ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేయనున్నారు. ఈనెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

AP Corona Holidays

ఈ విషయంపై నేడు పాఠశాల ముగింపు సమయం లోపల అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిన్న గుంటూరులోని కాకుమాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు పొడగించే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 

అయితే రోజురోజుకూ పెరుగుతోన్న కోవిడ్ కేసుల దృష్ట్యా పిల్లలను స్కూల్స్ కు పంపించే విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండటం.. ఇవాళ పబ్లిక్ ఒపీనియన్ ఆధారంగా సెలవుల పొడిగింపుపై అధికారిక ప్రకటన చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. దాని అనుగుణంగా ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ కు ప్రణాళికలు సిద్దం చేయనుంది.

కాగా, తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటివరకు విద్యార్ధులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ సిద్దం చేస్తోంది.

AP Corona Holidays : ఏపీలో పాఠశాలలకు సెలవులు పొడిగింపు.పై నేడు నిర్ణయం ?!



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad