- నేడు కేబినెట్ భేటీ
- ఉద్యోగుల పీఆర్సీ
- పాఠశాలలకు శలవులు
- ఒమిక్రాన్ పై ప్రధాన చర్చ
పీఆర్సీపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో శుక్రవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోనుంది.
ప్రధానంగా పీఆర్సీపైనే ప్రధాన చర్చ జరుగనున్నట్లు సమాచారం. ఉద్యోగుల ఆందోళన చల్లార్చేందుకు మంత్రివరం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ ఏడాదిలో తొలిసారిగా ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరుగనున్నది.
ఈ భేటీలో పలు కీలక అంశాలు ఈ చర్చకు రానున్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోన్నందున దాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినెట్ దృష్టి సారించనుంది.
AP Cabinet Meeting : పాఠశాలలకు శలవులు, ఒమిక్రాన్, ఉద్యోగుల పీఆర్సీ పై ప్రధాన చర్చ
లాక్ డౌన్, పాఠశాలకు సెలవులు, పరీక్షలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే సినిమా టికెట్ల అంశం చర్చకు రానున్నది. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు.. ఇతర ప్రతిపాదనలపై మంత్రులు చర్చించనున్నారు.
అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలు, మూడు రాజధానుల కోసం తీసుకుని రాదలిచిన కొత్త బిల్లు.. ప్రస్తావనకు వస్తుందని తెలుస్తోంది. మొత్తం అజెండాలో 25కు పైగా అంశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలావుండగా, సచివాలయంలో మంత్రివర్గ సమావేశం రోజే పీఆర్సీపై ఉమ్మడి పోరాటం అందుకు నూత ఏర్పాటయిన పీఆర్సీ సాధన సమితి తొలి సమావేశం కూడా సచివాలయంలో జరపాలని నేతలు నిర్ణయం తీసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం.