Trending

6/trending/recent

Viral Video: ఇదేం ఎంపైరింగ్‌ బాబు.. వైడ్‌ సిగ్నల్‌ను ఇలా కూడా ఇస్తారా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

 Viral Video: క్రికెట్‌ అంటేనే అద్భుతాలకు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెట్టింది పేరు. బంతికి బంతికి పెరిగే ఉత్కంఠత, ఏ క్షణనా ఏం జరుగుతుందో అన్న ఆసక్తి వెరసి క్రికెట్‌ను చూడడానికి స్క్రీన్లకు అతుక్కుపోతుంటారు. అయితే ఎప్పుడూ సీరియస్‌గా జరిగే ఈ మ్యాచ్‌లో అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌ కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఎంపైర్‌లు చేసే చిత్ర విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. మనకు తెలిసి ఇలాంటి ఫన్నీ ఎంపైరింగ్‌ చేసే వారిలో న్యూజిలాండ్‌కు చెందిన బిల్లి బౌడెన్‌ మొదటి వరుసలో ఉంటారు. బిల్లి స్టేడియంలో ఉన్నాడంటే ప్రేక్షకులకు మ్యాచ్‌తో పాటు ఇతని విన్యాసాలతో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతాడు.

అయితే తాజాగా దేశీవాలీ క్రికెట్‌లో జరిగిన ఓ సంఘటన బిల్లి బౌడెన్‌ను సైతం వెనక్కి నెట్టేసింది. ఆయన చేసిన విన్యాసాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. తాజాగా మహారాష్ట్ర లోకల్‌ క్రికెట్‌లో పురందర్‌ ప్రీమియం లీగ్‌ పేరుతో ఓ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా ఎంపైరింగ్ చేసిన వ్యక్తి వైడ్‌ బాల్‌ పడగానే.. వెంటనే తల కింది రెండు కాళ్లు పైకి చేసి.. కాళ్లతో వైడ్‌ సిగ్నల్‌ను చూపించాడు.

దీంతో దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు సెల్‌ ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఈ ఎంపైర్‌ స్టేడియంలో యోగాను పరిచయం చేశాడు, ఎంపైరింగ్‌కి అప్‌డేట్‌ వెర్షన్‌ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..


Viral Video: ఇదేం ఎంపైరింగ్‌ బాబు.. వైడ్‌ సిగ్నల్‌ను ఇలా కూడా ఇస్తారా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad