Trending

6/trending/recent

Omicron vs Delta Variant: డెల్టా కంటే డేంజర్.. ఎక్కువ ప్రమాదంలో ఉన్నది ఎవరు.. టీకా భరోసా ఎంతవరకు? పూర్తి వివరాలు మీకోసం..!

Omicron: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్, కరోనా కొత్త రూపాంతరంతో ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది, నేడు మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు.

Omicron vs Delta Variant: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్, కరోనా కొత్త రూపాంతరంతో ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. నేడు మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో మరోసారి దేశవ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తనున్నాయా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. డిసెంబర్ 2 న కర్ణాటకలో రెండు ఓమిక్రాన్ కేసులు కనుగొన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో కనుగొన్న వారంలోపే, ప్రస్తుతం Omicron భారతదేశం, అమెరికా, యూకే సహా ప్రపంచంలోని 29 దేశాలకు పాకింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ గురించి పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వేగంగా వ్యాపించే (B.1.1.529) కరోనా ఈ కొత్త వేరియంట్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ప్రపంచంలో సరికొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిన డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. డెల్టా కంటే వేగంగా పరివర్తన చెందగల సామర్థ్యం దీనికి ఉండడమే కారణమంటున్నారు.

రెండు వేరియంట్‌లకు సంబంధించిన కేసులు మొదట ఎక్కడ వెలుగు చూశాయి?

డెల్టా వేరియంట్ భారతదేశంలో మొదటిసారి అక్టోబర్ 2020లో కనిపించింది. అయితే ఇది కొన్ని నెలల తర్వాత ఏప్రిల్ 2021లో భారతదేశంలో వినాశనాన్ని కలిగించింది. ఇది దేశంలో రెండవ కరోనా వేవ్‌కు దారితీసింది. డెల్టా భారతదేశానికే కాకుండా అమెరికా, బ్రిటన్‌తో సహా ప్రపంచంలోని 163 దేశాలకు విస్తరించింది. యేల్ మెడిసిన్ నివేదిక ప్రకారం, డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ అత్యంత డేంజర్ అని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులలో 99 శాతానికి కారణం కానుందని పేర్కొంది.

ఓమిక్రాన్ మొదటి కేసు 24 నవంబర్ 2021 న దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. WHO ప్రకారం Omicron నుంచి తెలిసిన మొదటి ఇన్ఫెక్షన్ నమూనా 9 నవంబర్ 2021న తీసుకున్నారు. మొదటి కేసు వచ్చిన వారం రోజుల్లోనే బోట్స్‌వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్‌తో సహా ప్రపంచంలోని 25 దేశాలతోపాటు భారత్‌లోనూ ఓమిక్రాన్ వ్యాపించింది.

ఇందులో ఎన్ని మ్యుటేషన్లు?

నివేదికల ప్రకారం Omicron అనేది ప్రపంచంలోని విధ్వంసం సృష్టించిన డెల్టా వేరియంట్ కంటే వేగంగా పరివర్తన చెందే వేరియంట్‌గా పేర్కొంటున్నారు. ఓమిక్రాన్‌లో మొత్తం 50 మ్యుటేషన్లు సంభవించాయి. వీటిలో 30 దాని స్పైక్ ప్రోటీన్‌లో సంభవించాయంట. స్పైక్ ప్రొటీన్ ద్వారానే కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించడానికి మార్గంగా ఉంటుంది. కాగా, డెల్టా ఎస్ ప్రోటీన్‌లో 18 ఉత్పరివర్తనలు మాత్రమే ఉన్నాయి.

ఓమిక్రాన్ రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 మ్యుటేషన్లు కూడా ఉన్నాయి. అయితే డెల్టా వేరియంట్‌లో 2 మ్యుటేషన్లు మాత్రమే ఉన్నాయి. రిసెప్టర్ బైండింగ్ డొమైన్ అనేది వైరస్‌లోని ఓ భాగం. ఇది మొదట మానవ శరీరంలోని కణంతో ఏకమవుతుంది.

వ్యాక్సిన్ ప్రభావం ఎవరిపై ఎంతవరకు ఉంటుంది?

ఏప్రిల్-మే 2021లో భారతదేశంలో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌పై కోవిడ్‌షీల్డ్ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉందని లాన్సెట్ ఇటీవలి పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన ప్రకారం, పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులపై వ్యాక్సిన్ సామర్థ్యం 63 శాతం కాగా, డెల్టా వల్ల వచ్చే మితమైన, తీవ్రమైన వ్యాధికి వ్యతిరేకంగా టీకా సామర్థ్యం 81 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

ఒమిక్రాన్‌పై ప్రస్తుతం ఉన్న టీకాల ప్రభావంపై ఎటువంటి పరిశోధనలు జరగలేదు. కానీ, ఈ రూపాంతరం స్పైక్ ప్రోటీన్‌లో 30 కంటే ఎక్కువ ఉత్పరివర్తనలు ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌ల కంటే తక్కువ ప్రభావవంతంగా లేదా పూర్తిగా పనికిరావని తేలింది. చాలా టీకాలు స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే స్పైక్ ప్రోటీన్‌లో పదునైన ఉత్పరివర్తనాల కోసం ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లను పనికిరాకుండా చేస్తుందని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.

ఎవరికి ప్రమాదం?

వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. వైరస్‌కు ఉన్న ఈ సామర్థ్యాన్ని R విలువ అంటారు. కరోనా ప్రారంభ వేరియంట్ R విలువ 2 నుంచి 3గా ఉన్నట్లు తేలింది. అలాగే డెల్టా వేరియంట్ R విలువ 6 నుంచి 7 గురికి అని తేలింది. అంటే డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తి 6 నుంచి ఏడుగురికి వైరస్ వ్యాప్తి చెందగలదని పేర్కొన్నారు.

అదే సమయంలో ఒమిక్రాన్ R విలువ డెల్టా కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ అని నమ్ముతున్నారు. అంటే Omicron సోకిన ఒక రోగి దాదాపు 35 నుంచి 45 మందికి వైరస్ వ్యాప్తి చెందించగలడని తెలుస్తోంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ 19 దేశాలకు విస్తరించింది. డెల్టా కంటే ఎక్కువ అంటువ్యాధి సామర్థ్యం కారణంగా ఇది చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్నారు.

చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా?

అక్టోబరు 2021లో కెనడా నుంచి వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం, డెల్టా వేరియంట్ మునుపటి వేరియంట్‌లతో పోలిస్తే ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని 108 శాతం, ఐసీ‍యూకి వెళ్లే ప్రమాదం 235 శాతం, మరణ ప్రమాదాన్ని 133 శాతం పెంచింది.

Omicron నుంచి ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. అయితే Omicron సంక్రమణ సంభావ్యత డెల్టా కంటే ఎక్కువగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మరణాలకు కారణమైంది. అందుకే ఓమిక్రాన్ విస్తరిస్తే తీవ్ర అస్వస్థతకు గురైన వారి సంఖ్యే కాకుండా డెల్టా కంటే మృతుల సంఖ్య కూడా ఎక్కువేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండింటి లక్షణాల మధ్య తేడా ఏమిటి?

డెల్టా లక్షణాల నుంచి ఒమిక్రాన్ లక్షణాలు కొంత భిన్నంగా ఉండవచ్చని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. ఒమిక్రాన్ వంటి వాటికి రుచి లేదా వాసన ఉండదు. అయితే డెల్టాకు ఉంటుంది. ఇది ఖచ్చితంగా చెప్పేందుకు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఒమిక్రాన్ లక్షణాలు కరోనా మునుపటి వేరియంట్లతో పోల్చితే భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఈ లక్షణాలు కచ్చితంగా చెప్పాలంటే మాత్రం కొన్ని రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. రుచి, వాసన కోల్పోవడం మినహా, డెల్టా, ఓమిక్రాన్ ప్రధాన లక్షణాలు.. గొంతు నొప్పి, జ్వరం, అలసట, తలనొప్పి ఒకే విధంగా ఉంటాయని తెలిపింది.
Omicron vs Delta Variant: డెల్టా కంటే డేంజర్.. ఎక్కువ ప్రమాదంలో ఉన్నది ఎవరు.. టీకా భరోసా ఎంతవరకు? పూర్తి వివరాలు మీకోసం..!


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad