Indonesia:అగ్నిపర్వతం బద్దలై గ్రామాలపై విరుచుకుపడ్డ లావా.. 13 మంది మృతి

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఇండోనేషియాలో మరోసారి అగ్ని పర్వతం బద్దలయ్యింది.. ఈ ఘటనతో లావా ఉవ్వెత్తున్న ఎగిసిపడి నిప్పులు చిమ్ముతూ ఊళ్లపై పడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

ఇండోనేషియాలో అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లై 13 మంది మృత్యువాత పడ‌గా.. 90 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. మ‌రో ఏడుగురి ఆచూకీ గల్లంతయ్యింది. శ‌నివారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత జావా ద్వీపంలోని అత్తి పెద్ద (3,600 మీట‌ర్ల‌) సెమెరు అగ్నిప‌ర్వ‌తం విస్పోట‌నం చెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దీంతో 12,000 మీట‌ర్ల ఎత్తున బూడిన ఎగ‌జిమ్మి, పెద్ద ఎత్తున గ్యాస్, లావా ఉబికి వ‌చ్చాయి. హఠాత్తుగా అగ్ని పర్వతం బద్దలై లావా ఉప్పొంగి చుట్టుపక్కల గ్రామాలపై విరుచుకుపడింది.

తూర్పు జావాలోని లుమాజంగ్ జిల్లాలోని కనీసం 11 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వాయువేగంతో లావా ఉబికి వస్తూ ఇళ్లు, వాహనాలను కప్పివేసింది. పశువు సంపద ఉక్కిరిబిక్కిరయ్యింది. కనీసం 900 మంది నిర్వాసితులు మసీదులు, పాఠశాలలు, విలేజ్ హాళ్లలో ఆశ్రయం పొందుతున్నారు.

సెమెరు అగ్నిపర్వతం బద్దలైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ని పర్వతం బూడిదను ఆకాశంలోకి పంపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రజలు ప్రాణభయంతో కేకలు వేస్తూ పరుగులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఇప్పుడు 13 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అబ్దుల్ ముహారి చెప్పారు. బాధితుల్లో ఇద్దరిని గుర్తించినట్లు ఆయన తెలిపారు.

విస్ఫోటనంలో కనీసం 57 మంది గాయపడ్డారని, వీరిలో 41 మంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. లుమాజంగ్ వద్ద చిక్కుకున్నవారిలో 10 మంది సహాయక బృందాలు రక్షించినట్టు ముహారి చెప్పారు. అగ్ని పర్వతం సెగలు గక్కడంతో ఆదివారం సహాయక చర్యలు నిలిచిపోయినట్టు స్థానిక మీడియా మెట్రో టీవీ పేర్కొంది. మైనింగ్ సైట్‌లో ఉన్న స్థానిక కూలీలను సురక్షితంగా కాపాడినట్టు తెలిపింది.

భారీ వర్షం కారణంగా వేడి లావా అవక్షేపం కొత్త నదిని ఏర్పరిచే ప్రమాదం కూడా ఉందని ఇండోనేషియాకు చెందిన ప్రముఖ అగ్నిపర్వత శాస్త్రవేత్త సురోనో అన్నారు. ఇప్పటికే లావా శిథిలాలు, భారీ వర్షంతో లుమాజాంగ్‌లో కనీసం ఒక వంతెనను ధ్వంసమయ్యింది. దీంతో విపత్తు దళం వెంటనే ఆ ప్రాంతానికి ఎవ్వర్నీ చేరుకోకుండా నిరోధించారు. అగ్ని పర్వతం విస్ఫోటనంతో లావా ఒక గ్రామంలోకి చొచ్చుకొచ్చి ఇళ్ల పైకప్పులపై నుంచి ప్రవహిస్తోంది.

Indonesia:అగ్నిపర్వతం బద్దలై గ్రామాలపై విరుచుకుపడ్డ లావా.. 13 మంది మృతి



Below Post Ad


Post a Comment

0 Comments