Trending

6/trending/recent

Horoscope today: ఈ రాశివారు అనవసరమైన విషయాలలో తల దూర్చవద్దు.. పనులలో ఆటంకాలు

 Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్‌ 6)న సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి:

ఈ రాశివారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం. అనవసరమైన విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

వృషభ రాశి:

విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి జరుగుతుంది.

మిథున రాశి:

మీమీ రంగాలలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని పరిస్థితిలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు.

కర్కాటక రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో మాటలు పడాల్సి ఉంటుంది. కొన్ని సమయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి.

సింహరాశి:

వృత్తి, ఉద్యోగు, వ్యాపారులకు మంచి అవకాశాశాలు ఉంటాయి. వివిధ రంగాలలో పెట్టుబడులు పెడతారు. వ్యాపారం ముందుకు సాగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కన్యరాశి:

వ్యాపారాలలో మంచి ఆర్థికంగా ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మంచి వార్తలు వింటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి:

ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీరు అనుకున్న ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో పెద్దలను కలుసుకుంటారు.

వృశ్చిక రాశి:

వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్దల సహకారం అందుకుంటారు.

ధనుస్సు రాశి:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకర రాశి:

మీమీ రంగాలలో ఆశించిన ఫలితాలు రాబట్టుకుంటారు. విందో, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి:

పట్టుదలతో ముందుకు వెళితే అనుకున్న పనులు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి.

మీన రాశి:

తోటివారి సహకారంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఆరోగ్యం అదుపులో ఉంటుంది.

Horoscope today: ఈ రాశివారు అనవసరమైన విషయాలలో తల దూర్చవద్దు.. పనులలో ఆటంకాలు


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad