Trending

6/trending/recent

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. గత వారంతో పోలిస్తే..కొంతమేర తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price Today:  బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటుంది. ఈరోజున తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు, వెండి ధరలు  ఎలా ఉన్నాయో చూద్దాం..

గత వారం రోజులల్లో బంగారం ధర దిగివచ్చింది.  గత వారం ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,150లు ఉండగా నేడు.. రూ.48,820కు పడిపోయింది. అంటే ఈ ఏడు రోజుల్లో దాదాపు రూ.330 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా గత వారం ప్రారంభంలో రూ.45,050 లు ఉండగా నేడు రూ.44,750లుగా నమోదయ్యింది. దీంతో పసిడి కొనాలనుకునేవారికి కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర రూ. 4,445 లు ఉండగా రూ. 30 పెరిగి ఈరోజు రూ. 4,475లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 44,450 ఉండగా రూ. 300లు మేర పెరిగి .. ఆదివారం ఉదయానికి  రూ. 44,750లు గా నమోదైంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ. 4,849లు ఉండగా నేడు రూ.33పెరిగి నేడు రూ. 4,882లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. శనివారం రూ. 48,490 లు ఉండగా.. ఆదివారం ఉదయానికి  రూ. 330  మేర పెరిగి నేడు 48,820 లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.

బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర వారం రోజుల వ్యవధిలోనే భారీగా దిగివచ్చినా ..నిన్నటి నుంచి ఈరోజు ఉదయానికి స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది. వెండి కొనాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

ఆదివారం ఉదయానికి వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలో ఆదివారం కిలో వెండి ధర రూ.61,600 లుగా ఉంది. శనివారం డిసెంబర్ 4వ తేదీ కిలో వెండి రూ.61,200లు ఉంది. దీంతో నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ. 400మేర  పెరిగింది. అయితే వారం ప్రారంభంతో పోల్చుకుంటే.. ఇప్పుడు వెండి దిగివచ్చినట్లే చెప్పవచ్చు.

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. గత వారంతో పోలిస్తే..కొంతమేర తగ్గిన బంగారం, వెండి ధరలు


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad