Trending

6/trending/recent

Find others love: ఇలా చేస్తే ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడ్డట్లేనట..

 కొన్ని కొన్ని సార్లు మనం ఎవరినైనా ఇష్ట పడతాం. అటువంటపుడు వాళ్లు కూడా తిరిగి మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది మనకు తెలియదు. చాలామంది ఇదే...

  • ఎదుటివారి ప్రవర్తన చెప్పే ఎన్నో విషయాలు
  • లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలు
మీలాగే వాళ్లకి కూడా మీ పైన ఆకర్షణ ఉందా లేదా ప్రేమిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు మనుషులు వారి యొక్క భావాలను వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు. ఫ్రాంక్‌గా చెప్పి భావాలను ఎక్స్‌ప్రెస్ చేయడం కొంచెం కష్టమైన పనే. అయితే ఒకరు ప్రపోజ్ చేసే వరకూ కూడా మరొకరు ఏమనుకుంటున్నారు వాళ్ల గురించి అనేది తెలియదు. అయితే రెండు వైపుల నుండి కూడా ప్రేమ లేదా ఆకర్షణ ఉండదు.

నిజంగా ఇద్దరు ఇష్టపడుతున్నారో అనేది ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూద్దాం. ఈ విధంగా కనుక మీరు గమనిస్తే కచ్చితంగా ఎదుటి వాళ్లు కూడా మీలాగే ఇష్టపడుతున్నారా లేదా అనేది తెలిసిపోతుంది.

మాట్లాడడం:

ఎప్పుడైనా మీరు ఎవరినైనా ఇష్టపడితే వాళ్లతో మాట్లాడేటప్పుడు ఏవైనా చెప్పినప్పుడు వాళ్ళల్లో కాస్త ఆనందం ఉంటుంది. మీలానే వాళ్లు కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంటారు. కచ్చితంగా వాళ్ళు మీరు ఏమైనా చెప్తున్నప్పుడు వింటారు అదే విధంగా తిరిగి ఏమైనా ప్రశ్నలు అడుగుతారు. అలానే మీరు మాట్లాడేటప్పుడు వాళ్లు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇది నిజంగా చాలు వాళ్లు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి.

ఐ కాంటాక్ట్:

ఎప్పుడైనా మీరు ప్రేమించే వ్యక్తి తో మాట్లాడేటప్పుడు ఒక స్పెషల్ లుక్ అనేది వాళ్ళ కళ్ళల్లో వస్తుంది. అలా లుక్ ఉంది అంటే కచ్చితంగా వాళ్లు మిమ్మల్ని ఇష్ట పడుతున్నారని మీరు గ్రహించవచ్చు. మాటలు అబద్ధం చెప్పినా కళ్ళు మాత్రం అబద్దం చెప్పవు. మీరు కళ్ళను చూసి వాళ్లు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు.

కష్ట పడడం:

ఎప్పుడైనా ఎదుట వాళ్ళు మీ కోసం ఏదైనా చేయాలనే తాపత్రయం పడినప్పుడు వాళ్లు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని తెలుసుకోవచ్చు. ఇది చాలా పెద్ద సిగ్నల్ అని చెప్పచ్చు. మీకు నచ్చే వాటికి ఎక్కువ కాలం పాటు గుర్తు పెట్టుకోవడం, మీకు నచ్చిన వాటి కోసం వాళ్ళు ఏమైనా చేయాలి అనుకోవడం చూస్తే మిమ్మల్ని ఇష్ట పడుతున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు.

దగ్గరగా ఉండడం :

మీరు ఇష్టపడే వాళ్ళు మీకు దగ్గరగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఇష్టపడుతున్నారని తెలుసుకోవచ్చు. మీకు దగ్గరగా కూర్చోవడం, మీతో ఎక్కువగా మాట్లాడటం లాంటివి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని చెప్పే సంకేతాలు. కాబట్టి వాళ్ళు మీకు దగ్గరగా ఉంటున్నారు అనే దాన్ని చూస్తే మీరు వాళ్లని ఇష్టపడుతున్నట్లు వాళ్లు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం.

సిగ్గు పడడం :

మీరు ఇష్టపడే వ్యక్తిని కనుక మీరు ఇష్టపడుతున్నారు అంటే వాళ్లు మిమ్మల్ని చూస్తే సిగ్గుపడతారు. వాళ్ళని మీరు చూసినప్పుడు వాళ్ళ మొహంలో కనుక కాస్త సిగ్గు లేదా నవ్వు లాంటిది మీరు నోటీస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని తెలుసుకోవచ్చు. ఇలా ఈ చిన్న చిన్న వాటిని మీరు గమనించి సులభంగా వాళ్లు మిమ్మల్ని చూసి పెడుతున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు .


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad