Feet Touching Rules : ఒకరి పాదాలను తాకేటప్పుడు ఈ ఐదు విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Feet Touching Rules : సనాతన సంప్రదాయంలో పెద్దల పాదాలను తాకి ఆశీస్సులు పొందడం అనేది ఒక భాగం. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. తల్లితండ్రులు, గురువులు, పెద్దవారి పాదాలను తాకి వారి ఆశీస్సులు పొందడం అనాదీగా వస్తోంది. హిందుత్వంలో పెద్దల పాదాలను తాకి ఆశీర్వచనాలు తీసుకోవాలని కోరిక అందరిలోనూ ఉంటుంది.అ యితే, అయితే ఎవరి పాదాలను తాకాలి?, అందుకు నియమాలు ఏంటి? పూజ సమయంలో గురువు, పెద్దల పాదాలను ఎలా తాకాలి? పాదాలను తాకడానికి సమయం ఏమైనా ఉంటుందా? పాదాలను తాకడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

దేవతా మూర్తులతో ముడిపడి ఉంది..

సనాతన కాలం నుంచి కొనసాగుతున్న పాద స్పర్శ సంప్రదాయం సామాన్యుడికే కాదు దేవతలతోనూ ముడిపడి ఉంది. పాదాలను తాకడమే కాకుండా పాదాలు కడుగుతూ తమ బంధువుల పట్ల, పెద్దల పట్ల భక్తిని చాటుకోవడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు తన మిత్రుడు సుదాముని పాదాలను తాకడమే కాకుండా తన చేతులతో కడగడానికి కూడా వెనుకాడలేదు. అలా పాదాలను తాకడం ద్వారా వారి ఆశీర్వచనం లభిస్తుందని విశ్వాసం.

పాదాలను తాకడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఒక వ్యక్తి పాదాలను తాకడం వెనుక ఇతరులకు గౌరవం ఇవ్వడమే భావన మాత్రమే కాకుండా.. ఈ సంప్రదాయం వెనుక మానవజాతి సంక్షేమం దాగి ఉంది. దీనికి సంబంధించిన నిగూఢ రహస్యాలు తెలిస్తే మీరు కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించడానికి వెనుకాడరంటే అతిశయోక్తి కాదు. పెద్దల పాదాలను తాకినప్పుడు వారిలోని పాజిటివ్ ఎనర్జీ ఆశీర్వాదాల రూపంలో మనలోకి ప్రవహిస్తుంది. తద్వారా మనకు ఆనందం, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పాదాలను తాకడం ద్వారా నవగ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి.

పాద స్పర్శ నియమాలు..

పెద్దలను, దేవతలను నమస్కరించేందుకై అనేక విధి విధానాలు ఉన్నాయి. పాదాలను తాకడం, మోకరల్లడం, సాష్టాంగ నమస్కారం చేయడం వంటివి ఉన్నాయి. అయితే, మీరు ఎవరి పాదాలను అయినా తాకాలనుకున్నప్పుడు.. మీరు మీ ఎడమ చేతితో ఎడమ పాదాన్ని, కుడి చేతితో కుడి పాదాన్ని తాకాలి. అదే విధంగా సాష్టాంగ నమస్కారంలో పూర్తి వినయం, భక్తితో మీ తలని రెండు చేతుల మధ్యలో ఉంచి పూర్తిగా నేలను తాకి పాదాలను నమస్కరించాలి.

వీరి పాదాలను తాకాలి..

పెద్దవారి పాదాలనే కాదు.. పిల్లల పాదాలను తాకవచ్చు. తీజ్ పండుగ సమయాల్లో ఆడపిల్లల పాదాలను తాకి ఆశీర్వాదాలు పొందవచ్చు.

నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పెద్దల పాదాలను తాకడం ద్వారా నవగ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. అన్నయ్య పాదాలను నమస్కరిస్తే బుధిని పాదాలను నమస్కరించినట్లు, అమ్మమ్మ, అమ్మ, అత్త, చిన్నమ్మ, నానమ్మ పాదాలను తాకడం ద్వారా సూర్య భగవానుడు, చంద్రుడి పాదాలను నమస్కరించినట్లు. సోదరి, అత్త, గురువు, సాధువుల పాదాలను తాకడం ద్వారా బృహస్పతి పాదాలను నమస్కరించినట్లు, బ్రాహ్మణుల పాదాలను తాకడం ద్వారా బృహస్పతి, పెద్దల పాదాలను తాకడం ద్వారా కేతువు, శుక్రుడు పాదాలను తాకినట్లుగా జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.

Feet Touching Rules : ఒకరి పాదాలను తాకేటప్పుడు ఈ ఐదు విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..

Below Post Ad


Post a Comment

0 Comments