నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. పార్లమెంట్ వ్యసాయ చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.
మూడు వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రద్దు చేస్తామని ఈ ఏడాది నవంబర్ 19న ప్రకటించారు. పంజాబ్, యూపీ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగడానికి కొన్ని నెలల ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. 2020 సెప్టెంబర్ మాసంలో మూడు వ్యవసాయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లుపై ఆమోదం తెలిపే సమయంలో విపక్ష సభ్యులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విపక్ష సభ్యులు Rajya sabha లో ఆందోళనకు దిగారు. ఆ సమయంలో రాజ్యసభలో సభ్యులు వ్యవహరించిన తీరుపై రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఆమోదం తెలిపేందుకు అధికార పార్టీ వ్యవహరించిన తీరును విపక్షాలు అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టాయి.
New farm laws act నిరసిస్తూ ఏడాది కాలంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా కూడా మారాయి. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి తనయుడు అశిష్ మిశ్రా కారు నడపడంతో పెద్ద ఎత్తున రైతులు మరణించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ ఘటనలో ఆశిష్ మిశ్రా అరెస్టయ్యాడు. మరో వైపు ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని కూడా విపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి వేలాది మంది రైతులు 2020 నుండి ఢిల్లీ వెలుపల నిరసన దీక్షకు దిగారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికలకు ముందు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ చట్టాలను ఎందుకు రద్దు చేశారనే విషయమై చర్చకు విపక్షాలు ఉభయ సభల్లో పట్టు బట్టారు. ప్రభుత్వం పెద్దగా చర్చ లేకుండానే పార్లమెంట్ ద్వారా మూడు చట్టాలను తీసుకొచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేసే సమయంలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ డిమాండ్ చేశారు.
అయితే ఈ మరణాలకు సంబంధించిన డేటా తమ దగ్గర లేదని కేంద్రం ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, బుధవారం పార్లమెంట్‌లో ఆరు ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా డేటా తమ దగ్గర లేనందువల్ల రైతులకు పరిహారం ఇవ్వలేమని ఆయన తేల్చి చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.రైతుల మరణాలపై డేటా లేదని కేంద్ర ప్రభుత్వం ఇలా చెప్పడం ఇది రెండవసారి. జూలై-ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో కూడా రైతుల మరణాలపై తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం తెలిపింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తూ సుమారు 800 మంది రైతులు మరణించారని బీజేపీయేతర పార్టీలు సహా అనేక మంది చెబుతున్నారు.