Trending

6/trending/recent

Employee Agitation Postponed: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యమ కార్యాచరణ వాయిదా

  • ఏ.పి.ఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కామ్రేడ్ బండి శ్రీనివాసరావు, కామ్రేడ్ కె.వి. శివారెడ్డి

విజయవాడ 16-12-2021 : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు గత రెండు సంవత్సరాలుగా పరిష్కారం కాకపోవడంతో, అనేక దఫాలుగా ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు మరియు గౌరవ ముఖ్యమంత్రివర్యులకు విజ్ఞాపనలు చేసినప్పటికి, సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండడంతో, గతిలేని పరిస్థితులలో 21-10-2021న ఏ.పి. జె.ఏ.సి. మరియు ఏ.పి.జె.ఏ.సి. అమరావతి ఐక్యవేదిక పేరిట 71 డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గారికి ఇచ్చిన లేఖపై ఏ విధమైన స్పందన లేదు. అలాగే 29-10-2021న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా సమస్యల పై అధికారుల నుండి స్పష్టమైన హామీ రాలేదు. మరియు 12-11-2021న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా 11వ పి.ఆర్.సి. నివేదికపై స్పష్టత రాలేదు. ఈ కారణాలన్నింటిని ఏ.పి. ఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం, ఏ.పి.జె.ఏ.సి. రాష్ట్ర కార్యవర్గం విస్తృత చర్చల అనంతరం మరియు ఏ.పి.జె.ఏ.సి., ఏ.పి.జె.ఏ.సి. అమరావతిల ఐక్యవేదిక నిర్ణయం ప్రకారం 7-12-2021 నుండి 6-1-2022 వరకు దశలవారి ఉద్యమం చేపట్టుటకు నిర్ణయించిన సంగతి అందరికి తెలిసినదే అందులో భాగంగా 1-12-2021న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి దశల వారీ ఉద్యమ కార్యాచరణ గూర్చి రెండు జె.ఏ.సి.ల నాయకులు లేఖను అందించారు. అయినప్పటికి ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరుపలేదు. ఐయితే 7-12-2021 నుండి ఇప్పటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసిన పోరాటాల ఫలితంగా, ఉద్యోగుల అసహనాన్ని, జరిగిన పొరపాటును గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రివర్యుల అదేశముల మేరకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డిగారు, ఆర్థికశాఖామాత్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిగారు మరియు ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) శ్రీ ఎన్. చంద్రశేఖర్రెడ్డిగారు ఇతర ఉన్నతాధికారులు 15-12-2021న రెండు జె.ఏ.సి. నాయకులతో మరియు ఇతర సభ్యసంఘాలతో మధ్యాహ్నం 2. గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అనగా సుమారు 7 గంటలు 11వ పి.ఆర్.సి. అమలు, సి.పి.ఎస్. రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 7 డి.ఏ.ల విడుదల, జి.పి.ఎఫ్., ఏ.పి.జి.ఎల్.ఐ. తదితర ఆర్థిక రాయితీల విడుదలతో పాటు పెన్షనర్లకు రావల్సిన ఆర్థిక సౌకర్యాల చెల్లింపు మొదలగు 71 డిమాండ్లపై సుదీర్ఘ చర్చలు జరిపారు.

ఇందు 11వ పి.ఆర్.సి. విషయమై 11వ పి.ఆర్.సి. కమీషన్ శ్రీ అషుతోష్మిశ్రా గారు సమర్పించిన నివేదికపై తప్ప కార్యదర్శుల నివేదికపై తాము చర్చించమని, దానిని తాము పరిగణనలోనికి తీసుకోమని ఏ.పి. ఎన్జీవో సంఘం, ఏ.పి.జె.ఏ.సి. మరియు ఏ.పి. జె.ఏ.సి. అమరావతిల నాయకులు ముక్తకంఠంతో ప్రభుత్వానికి స్పష్టీకరించారు. అంతేకాక కార్యదర్శుల నివేదికలో గల తప్పులను ఆధారాలతో సహా ఎత్తిచూపగా గౌరవ ఆర్థిక శాఖామాత్యులు మరియు ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డిగారు ఉద్యోగుల విజ్ఞప్తిని అర్ధం చేసుకుని, శ్రీ అషుతోఫ్మిశ్రాగారి నివేదిక ప్రకారం మరియు ఇతర 71 డిమాండ్లను మీ సూచనలను, సలహాలను, డిమాండ్లను గౌరవ ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకుని వెళతామని త్వరలో ముఖ్యమంత్రివర్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, మీ సమస్యల సాధనలో కరోనా వలన ఆలస్యమైనదే కాని ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉద్యోగులు కూడా తమ ప్రభుత్వంలో భాగస్వామ్యులేనని, ఉద్యోగులు లేనిదే ప్రభుత్వ పధకాల అమలు సాధ్యం కాదని, కావున ఏ.పి.జె.ఏ.సి., మరియు ఏ.పి.జె.ఏ.సి. అమరావతిలు చేస్తున్న ఉద్యమ కార్యాచరణను విరమించాలని రెండు జె.ఏ.సి.ల నాయకులు కామ్రేడ్ బండి శ్రీనివాసరావు, కామ్రేడ్ జి.హృదయరాజు, కామ్రేడ్ కె.వి. శివారెడ్డి, కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కామ్రేడ్ వై.వి. రావులను మరియు వారి సభ్య సంఘాల నాయకులను కోరారు. 

15-12-2021న జరిగిన సమావేశంలో 1-7-2018 నుండి 55% ఫిట్మెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కనీసం ఐ.ఆర్. ఇచ్చిన తేదీ నుండి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనంతరం ముఖ్యమంత్రిగారి ఆదేశానుసారం 16-12-2021న కూడా సాయంత్రం 5 గంటల నుండి 9గంటల వరకు రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాధ్డ్డిగారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మగారు, సాధారణ పరిపాలనాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు, మరియు ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) శ్రీ నలమారు చంద్రశేఖర్ రెడ్డిగారు మరొక సారి ఏ.పి.జె.ఏ.సి., మరియు ఏ.పి.జె.ఏ.సి. అమరావతిలు వారి వారి సభ్యసంఘాలతోను మరియు ఇతర జె.ఏ.సి.లతోను విడివిడిగా చర్చలు జరిపారు. ఇందు గౌరవ ముఖ్యమంత్రివర్యుల ఆదేశముల ప్రకారం ఉద్యోగుల సమస్యలన్నింటిని పరిష్కరించుటకు తాను చొరవతీసుకుంటానని గౌరవ ఆర్ధిక శాఖామాత్యులు ఇచ్చిన హామీ మేరకు మరియు గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు 22-12-2021న 71 డిమాండ్లతో సంబంధం గల అన్ని శాఖల కార్యదర్శుల స్థాయి సమావేశము ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని, అలాగే పి. ఆర్.సి.పై గౌరవ ముఖ్యమంత్రివరు చర్చించుటకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, కావున ఉద్యమ కార్యాచరణను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా 1-7-2018 నుండి 55% ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కనీసం ఐ.ఆర్. ఇచ్చిన తేదీ నుండి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలని పునరుద్ఘాటించారు. సదరు విజ్ఞప్తిని రెండు జె.ఏ.సి.ల ఐక్యవేదిక ఏర్పాటు చేసిన స్ట్రగుల్ కమిటీ మరియు అందుబాటులో గల సభ్య సంఘాల నాయకులతో చర్చించి, ఉద్యోగుల సమస్యల సాధనకు మరియు 11వ పి.ఆర్.సి. అమలుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్న పరిస్థితులలో, ప్రభుత్వంతో వైరం దిశగా కాకుండా, ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉద్యోగుల సమస్యల సాధనే ధ్యేయంగా పనిచేయాలని వచ్చిన ఏకాభిప్రాయం మేరకు మరియు గౌరవ ఆర్థికశాఖామాత్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డిగారు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గారు, సాధారణ పరిపాలనాశాఖ ప్రినిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు మరియు ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) శ్రీ ఎన్. చంద్రశేఖర్రెడ్డిగారు ఇచ్చిన లిఖితపూర్వక హామీ మేరకు 21-12-2021న జరుప తలపెట్టిన నిరసన ప్రదర్శనలను మరియు తదుపరి కార్యాచరణను తాత్కాలికముగా వాయిదా వేయడమైనదని తెలియజేయుచున్నాము. త్వరలో గౌరవ ముఖ్యమంత్రిగారు పి.ఆర్.సి. సమస్య పరిష్కరిస్తామని సి.ఎస్. గారు మరియు ఆర్ధిక శాఖామాత్యులు తెలిపారు.

అట్టడుగు స్థాయి నుండి రాష్ట్ర స్థాయివరకు 7-12-2021 నుండి 16-12-2021 వరకు అనగా ఈరోజు వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసిన ఉద్యమాలకు మరియు ఉద్యమ స్ఫూర్తికి ప్రతి ఒక్కరికి పేరుపేరున ఉద్యమాభివందనాలు తెలియజేయుచున్నాము. మీరు కనుపరచిన చేసిన ఉద్యమ పోరాటాల వలననే ప్రభుత్వంలో మన సమస్యల సాధనలో కదలిక వచ్చిందనుటలో అతిశయోక్తిలేదు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని, మాకు అందించాలని కోరుకుంటున్నాము. ఈ పోరాటాలలో ప్రధాన భూమిక పోషించిన ఏ.పి. ఎన్జీవో తాలూకా మరియు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు వారివారి కార్యవర్గాలకు విప్లవాభివందనాలు తెలియజేయుచున్నాము.

Download Pressnote

Employee Agitation Postponed:  ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యమ కార్యాచరణ వాయిదా

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad