Crime News: ఎంతపనిచేశావమ్మ.. చిన్న సమస్యకు ఇదా పరిష్కారం.. ఐదుగురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Rajasthan Crime News: భర్త వేధింపులు.. నిత్యం తాగాదాలు.. దీంతో మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు ఐదుగురి కూతుళ్లతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్‌ కోటాలోని కల్యాఖేడి గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఓ బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆరుగురి మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలు శివలాల్‌ బన్‌జారా భార్యగా గుర్తించారు. మరణించిన వారిలో బాదందేవి (40), సావిత్రి (14), అంకాలీ (8), కాజల్‌ (6), గుంజన్‌ (4), అర్చన గా గుర్తించారు. కాగా.. మిగతా ఇద్దరు కూతుళ్లు గాయత్రి (15), పూనమ్‌ (7) నిద్రపోవడం వల్ల మృత్యువు నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దుప్పట్లను విక్రయించే శివలాల్‌కు, భర్య బాదందేవికి తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. అయితే.. సంఘటన సమయంలో శివలాల్‌ ఇంటి దగ్గర లేడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని.. భర్తను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని ఎస్‌హెచ్‌ఓ రాజేంద్ర మీనా వెల్లడించారు. కాగా.. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.

Crime News: ఎంతపనిచేశావమ్మ.. చిన్న సమస్యకు ఇదా పరిష్కారం.. ఐదుగురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య

Below Post Ad


Tags

Post a Comment

0 Comments