Trending

6/trending/recent

CBSE Exam New Guidelines: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్.. 12 తరగతుల టర్మ్‌-1 పరీక్షలకు నూతన నిబంధనలు..

 CBSE Exam New Guidelines: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మిగిలిన 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సీబీఎస్‌ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీనితో పాటు  డిసెంబర్ 16, 2021 నుండి డిసెంబర్ 30, 2021 వరకు మిగిలిన 12వ తరగతి పరీక్షల సమయంలో వారి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని బోర్డు సెంటర్ సూపరింటెండెంట్‌ వెల్లడించారు. ఈరోజు అంటే డిసెంబర్ 16న హిందీ పేపర్ నిర్వహించారు. ఈ పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది.

కొత్త మార్గదర్శకాలు ఇవే..

పరీక్షలు జరుగుతున్న కేంద్రాలకు ముందుగా బోర్డు నుండి పాస్‌వర్డ్ మెయిల్‌ల ద్వారా చేరుకుంటుంది. పరీక్ష నిర్వహిస్తున్న కేంద్రంకు సీబీఎస్సీ అధికారులు ఓ కోడ్‌ను 15 నిమిషాల ముందు అంటే.. ఉదయం 10:45 amకి పాఠశాలలకు పంపిస్తారు. హాజరైన విద్యార్థులందరూ ఉదయం 10:45 గంటలకు పరీక్ష హాలులోకి ప్రవేశించేలాని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసినత తర్వాతే లోపలికి అనుమతించాలన్నారు. పరీక్ష ప్రారంభం ఆలస్యమైతే విద్యార్థులకు అంత అదనపు సమయం కూడా ఇవ్వాలని ఆదేశించారు.

సీబీఎస్‌ఈ టర్మ్‌ 1 బోర్డు పరీక్ష ఆఫ్‌లైన్‌ మోడ్‌లో నిర్వహించబడుతుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది. శీతాకాలం దృష్ట్యా పరీక్షలు ఉదయం 10.30 గంటలకు బదులు 11 గంటలకు ప్రారంభం అవుతుంది. టర్మ్‌ 2 పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 114 సబ్జెక్టులు ఉన్నాయి. సీబీఎస్‌ఈలో మొత్తం సబ్జెక్టుల పరీక్ష నిర్వహిస్తే, పరీక్షల మొత్తం వ్యవధి కనీసం 40-45 రోజులు ఉంటుంది. అన్ని సబ్జెక్టుల పరీక్ష నిర్వహిస్తే పరీక్షల మొత్తం వ్యవధి కనీసం 40-45 రోజులు ఉంటుంది. అందువల్ల విద్యార్థుల అభ్యాన నష్టాన్ని నివారించడానికి సీబీఎస్‌ఈ అందించే సబ్జెక్టులను రెండు విభాగాలుగా విభజించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.

పరీక్ష ముగిసిన  తర్వాత 15 నిమిషాలలోపు అన్ని OMR షీట్‌లను పరిశీలకుల సమక్షంలో ప్యాక్ చేసి సూపరింటెండెంట్‌ల సమక్షంలో సీలు చేయాలని సూచించారు. సెంటర్ సూపరింటెండెంట్, సూపర్‌వైజర్ సీల్డ్ పార్శిల్‌పై సంతకం చేసి ప్యాకింగ్ సమయాన్ని తెలియజేస్తారు. OMR షీట్లను ప్యాక్ చేసి, సీల్ చేసిన తర్వాత, అవి సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి పంపబడతాయి.
CBSE Exam New Guidelines: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్.. 12 తరగతుల టర్మ్‌-1 పరీక్షలకు నూతన నిబంధనలు..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad