Trending

6/trending/recent

BSNL: సామాన్యుడికి అందుబాటులో బీఎస్ఎన్ఎల్…

 దేశీయ టెలీకాం కంపెనీలు నెల‌వారీ టారిఫ్ రేట్ల‌ను భారీగా పెంచాయి.  25 శాతం మేర టారిఫ్ రేట్ల‌ను పెంచ‌డంతో వినియోగ‌దారులు షాక్ అవుతున్నారు.  గ‌తంతో రూ.149 టారిఫ్ ఉన్న ఎయిర్‌టెల్ ప్యాకేజీ ఇప్పుడు రూ. 179కి చేరింది.  అలానే, జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా టారిఫ్ రెట్ల‌ను పెంచాయి.  టారీఫ్  ధ‌ర‌ల‌ను పెంచిన‌ప్ప‌టికీ అద‌నంగా ఎలాంటి ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌లేదు.  అయితే, బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.  గ‌తంలో ఉన్న టారిఫ్‌ల‌ను య‌ధాత‌ధంగా అందిస్తోంది.  ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్ ఐడియా నెల‌వారీ ప్యాకేజ్ 179,155,179  ల‌లో నెల మొత్తానికి 2జీబీ డెటా, అన్ లిమిటెట్ కాల్స్ ను అందిస్తోంది.  28 రోజుల ప్యాకేజీతో ఇవి అందుబాటులో ఉన్నాయి. 

అయితే, బీఎస్ఎన్ఎల్ మాత్రం పాత టారిఫ్ 147ను య‌థాతదంగా అలానే ఉంచింది.  రూ. 147 ప్యాకేజీలో 28 రోజుల‌కు 10 జీబీ డేటాను అన్ లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తోంది. అయితే, ఎయిర్‌టెల్ ప్యాకేజీలో అద‌నంగా అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిష‌న్‌, హాలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ అందుబాటులో ఉండ‌గా, జియోలో జియో యాప్ సూట్‌ను అందిస్తోంది.  వీఐలో వీఐ మూవీస్ అండ్ టీవీని అందిస్తోంది.  కాని, బీఎస్ఎన్ఎల్ ప్యాకేజీలో అవి అందుబాటులో లేవు.  

BSNL: సామాన్యుడికి అందుబాటులో బీఎస్ఎన్ఎల్…


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad