Breaking: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లాలో నిర్ధారణ

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు తెలిపింది. మొదట ఐర్లాండ్‌ నుంచి ముంబై వచ్చిన ప్రయాణికుడికి ముంబైలో టెస్ట్ చేయగా.. కోవిడ్‌ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో  ముంబై నుంచి సదరు ప్రయాణికుడు  విజయనగరం వెళ్లాడు. విజయనగరంలో మరోసారి టెస్ట్ చేయగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అలెర్టయ్యారు. బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి.. చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది.

Breaking: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లాలో నిర్ధారణ

Below Post Ad


Post a Comment

0 Comments