AP PRC News : పీఆర్సీ ఫిట్‌మెంట్ పీఠముడి వీడేనా? సీఎం జగన్ ఏం తేల్చబోతున్నారు?. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సజ్జల రామకృష్ణ.. సీఎంతో భేటీ తర్వాత పూర్తి క్లారిటీ రానుందా?. ఎంత మేరకు ఫిట్‌మెంట్ ఉండనుంది? ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు జరుపుతారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇవాళ పూర్తి స్పష్టత రానుంది.
AP PRC News
వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాలతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ చర్చలు జరిపారు. సీఎస్ సమీర్ శర్మతో కూడా ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యారు.
సీఎస్ తో భేటీ తర్వాత ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత సీఎం జగన్ తో మంత్రి బుగ్గన, సజ్జల భేటీ అయ్యారు.
ఆ తర్వాత ఇరు జేఏసీల నేతలు సజ్జలతో చర్చించారు. సీఎం వద్ద జరిగిన చర్చల సారాంశంతో పాటు ఫిట్‌మెంట్, ఇతర డిమాండ్లపై చర్చ జరిగింది.
ఉద్యోగుల ఇతర డిమాండ్లపై క్లారిటీ వచ్చినప్పటికీ.. ఫిట్‌మెంట్ పై మాత్రం సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని జేఏసీ నేతలకు సజ్జల చెప్పారు.
AP PRC News
ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం సీఎం జగన్ తో మంత్రి బుగ్గన, సజ్జల భేటీ కానున్నారు. ప్రధానంగా ఫిట్‌మెంట్ ఎంత ఇవ్వాలనే దానిపై చర్చించిన తర్వాత.. సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఒకవేళ ఫిట్‌మెంట్ పై తుది నిర్ణయం వస్తే, అవసరమైతే ఉద్యోగ సంఘాలతో కూడా సీఎం చర్చిస్తారని తెలుస్తోంది.
మరోవైపు తాము ఉద్యమాన్ని విరమించింది తాత్కాలికమే అన్నారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు. ఏ క్షణమైనా మళ్లీ ఉద్యమానికి వెళ్లే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం సానుకూలంగా ఉన్న సమయంలో ఉద్యమం సరికాదనే ఉద్దేశంతోనే తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారాయన.
ఇదిలాఉంటే.. ఫిట్‌మెంట్ విషయంలో కూడా ఉద్యోగ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు,
రెండు జేఏసీలు 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే.. సచివాలయ ఉద్యోగుల సంఘం మాత్రం కనీసం 34 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరుతుంది. అయితే లెక్కల ప్రకారం 34 ఫిట్మెంట్ ఇచ్చినా, 36 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా ఒకటే అని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఉద్యోగుల జీతాలు తగ్గకుండా సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. మరి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది సస్సెన్స్ గా మారింది.
ఇవాళ ఉదయం సీఎంతో సమావేశంలో ఫిట్‌మెంట్ పై స్పష్టత వస్తే ఉద్యోగ సంఘాలతో కూడా భేటీ అవుతారని తెలుస్తోంది. మరి ఫిట్‌మెంట్ విషయం ఏం తేలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.